శ్రీ సాయినాధ స్తోత్రమంజరి | Sri Sainadha Stotramanjari | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

శ్రీ సాయినాధ స్తోత్రమంజరి 
Sri Sainadha Stotramanjari
Rs 12/-
శ్రీ సాయినాధ స్తోత్రమంజరి | Sri Sainadha Stotramanjari | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

షిరిడి గ్రామంలో ఎండ మండు తోంది ! 
తన భుజానికి ఒక జోలీ తగిలించుకొని బయల్దేరినాడు ఒక బిచ్చగాడు !
ఒక చేతిలో తమరేలు ! కాలికి జోళ్ళు లేవు అయినా 
అతని ముఖంలో ఎదో వింత వెలుగు ! " అమ్మ భిక్షాం దేహి !"
ఏదైనా ఒక రొట్టి ముక్క ! ఓ పప్పు,లేదా చారు ! దానం చేయి తల్లి!"
అన్ని ఇళ్ల తలు పులు చేర వేసి వున్నై-వడ గాలుల నుండి రక్షణగా!
ఆ భిక్షువు కు అవి ఏమి పట్టవులావుంది . తన జోలె నిండాలె . తన తమరేలు నిండాలె 
అతని కోసం మసీదు వద్ద ఎన్నో జీవాలు ఎదురు చూస్తూ ఉంటాయి మరి !

అతని అంతరంగం నిర్హేతుక దయాసాగరం !
సర్వజీవత్ ప్రేమ -సర్వ మత సహనం అతని మతం. 
దయ -ప్రేమ అతని పద రక్షలు !

అక్కడ చాలామందికి అది పట్టదు. 
కొందరు తలుపులు తీయరు. కొందరు మాట్లాడరు !
కొందరు ఆ తలుపుని లాగి బిగించేస్తారు చిత్రంగా. 
వున్నారు కొందరు..... జాలి గల తల్లులు! 
ఏగాని ఖర్చు కైనా భర్తని చేయి చాచే భార్యలు. 
"వుండు బాబా ! ఏదో మిగిలింది తీసుకెళ్ళు నాయన!"
వారికీ తెలుసు ఈ పిచ్చి ఫకీర్ ఆ రొట్టెల్ని కూరల్ని తన మసీదు బయట వున్నాతొట్టెలో 
పడవేస్తాడని. 'ఆకలి గొన్న జీవరాసులు దానిపై దాడి చేసి కడుపునిండా తింటాయని !
ఏ కొంచమైనా మిగిల్తే తానూ తింటాడని.! '"

ఆకలి గొన్న అన్ని జీవుల్లోనూ ఆ పందులు కుక్కలు చీమలు అన్నింటా మరి మనలోనూ ఆ 
భిక్షువు లోను సర్వత్రా నిండి వున్నది ఆ శుద్ధ చైతన్యమే అని వాటి కోసమే ఈ అద్వైత ఫకీర్ 
బిక్షాటన అని ! షిర్డీ లో వున్నా అందరిలోనూ బహు కొద్దీ మందికే తెలుసు ఈ విషయం!
కా లం గడిచిన కొద్దీ అక్కడున్న 52 ఇళ్ల వాళ్ళకి అర్ధం అయ్యింది. 
ఆకలి గొన్న ఏ జీవికైనా అన్నం పెట్టు ...అన్నాడు బాబా ! 

మరి నేడో ! సాయి ని మనం వ్యవస్థి కృతం చేసేసాం. విగ్రహాలు అభిషేకాలు హోమాలు వేద మంత్రం పఠనాలు. చివరకి గేట్లు మూసి లోపల వున్నా సంపన్న భక్తులకు మాఅంచి భోజనం పెట్టేస్తాం. !

ఈ కమిటీలు కళ్ళు తెరచి ఆలయం గోడ బయట వుండే అన్నార్తులు అవిటివాళ్ళు శునకాలు పేద వాళ్ళ కి అన్నం విదిలించె నిజమైన అన్నదానము చూసే రోజు మనకి వస్తుందా?.. 
వస్తుంది ...ఏదోఒక రోజు తప్ప కుండా వస్తుంది. మనం మన కొంప వద్ద మొదలెడితే బాగు ! 
అద్వైతం అర్ధమయ్యి మనసులు ఆర్ద్ర మయి , నా ఆకలి-- నీ ఆకలి ఒక్కటే అని అర్ధ మయిన తరువాత నిజమైన అన్న వితరణ జరిగే రోజు వస్తుంది. నమ్మకం తో ఎదురు చూద్దాం
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment