సంతాన వేణుగోపాలస్వామి ఆలయం | Santhana Venugopala Swamy | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

సంతాన వేణుగోపాలస్వామి ఆలయం | Santhana Venugopala Swamy | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


సంతాన వేణుగోపాలుడు

    కృష్ణానది హంసలదీవిలో సముద్రుని ఒడిలో పదిలంగా చేరుతుంది. హంసలదీవిలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక కాకి ఈ ప్రాంతంలో హంసగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి ఆ హంసలదీవి అనే పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది.

అందరి పాపాలను కడిగిన గంగానది, ఆ పాప పంకిలాన్ని పోగొట్టుకోవడం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించగా, గంగాదేవిని కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించమన్నాడట శ్రీహరి. సకల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూన్న కాకి... కృష్ణవేణి సాగర సంగమంలో హంసగా మారడంతో, ఈ ప్రాంతాన్ని హంసలదీవిగా పిలుస్తున్నారు. ఇక్కడ ఎందరో మునులు తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, పరమహంసలు సంచరించిన ప్రదేశం కాబట్టి హంసలదీవి అన్నారని మరో ఒక కథనం ప్రచారంలో ఉంది.

వేణుగోపాలస్వామి ఆలయం...
ఇక్కడ వేణుగోపాలస్వామి రుక్మిణీసత్యభామా సమేతుడై కొలువుతీరాడు. ఈ ఆలయంలో శ్రీవేణుగోపాలస్వామి పిలచినదే తడవుగా పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఇది ఒక పవిత్ర పుణ్యస్థలం. ఈ దేవాలయాన్ని పూర్వం దేవతలే ఒక్కరాత్రిలో స్వయంగా నిర్మించారని స్థానికుల విశ్వాసం. దేవాలయ నిర్మాణం పూర్తయి, గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోవడంతో, దేవతలు వెళ్లిపోయారనీ అందువల్ల అది అసంపూర్తిగా మిగిలి పోయిందనీ అక్కడి ప్రజలు చెబుతారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు దానిని ఐదంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు.

ఇక్కడ స్వామి విగ్రహం నీలిమేఘచ్ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. ఈ ఆలయంలో వివాహం చేసుకుని, సాగరసంగమ ప్రదేశంలో నూతన దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే నూరేళ్లు సుఖంగా జీవిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా ఈ ఆలయంలో నిద్రచేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగుతుందని కూడా నమ్ముతారు.

– డా. వైజయంతి
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment