పురాణపండ రామాయణం | Puranapanda Ramayanam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
పురాణపండ 
రామాయణం 
 Puranapanda 
Ramayanam 
Rs 108/-

     శ్రీమద్రామాయణం, శ్రీమద్భగవద్గీత రెండూ పవిత్రగ్రంధాలే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ అవతార పురుషులే. మనకు ఆరాధ్యదైవాలే. అయితే ఒకానొక సమయంలో శ్రీరాముడు ఏమి చేస్తాడో దాన్ని చేయవద్దని, శ్రీరాముడు ఏమి చేయటానికి నిరాకరిస్తాడో దాన్ని చేయమని శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించినట్టు మనకు తెలుస్తుంది. మనం జాగ్రత్తగా ఆ రెండు గ్రధాలను పరిశీలిస్తే అది ఎట్లో చూద్దాం. వనవాసం చేస్తున్న శ్రీరామునితో రతుడు, ‘అన్నా! అరణ్యమెక్కడ? రాజ్యపాలన ఎక్కడ? జటలెక్కడ? క్షత్రియధర్మం ఎక్కడ? రాజ్యాభిషేకమే క్షత్రియునికి ధర్మం. రాజ్యపాలన చేతనే అతడు ప్రజలను రక్షించగలడు. ఆ విధంగా ఫలాన్ని ప్రత్యక్షంగా పొందగలిగే క్షత్రియ ధర్మాన్ని వదలి, ఎప్పుడో ఏదో తెలియని ఫలాన్ని పొందవచ్చు అన్నాడు. (పుట 266-106వ సర్గ-అయోధ్యాకాండం-శ్రీమద్రామాయణం) యుద్ధం చేయను, భిక్షాన్నం తిని జీవిస్తాను కానీ యుద్ధంలో బంధుమిత్రులను, గురువ్ఞలను చంపి రాజ్యాన్ని పొంది, రాజ్యపాలన చేయను అని చెప్పిన అన్జునునితో శ్రీకృష్ణుడు దాదాపు ఇక్కడ భరతుడు ఏమి చెప్పాడో అలాగే చెప్పి యుద్ధాన్ని చేయటానికి, పాలన చేయటానికి అర్జునుడిని ఒప్పించాడు.

    శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన బోధనే భరతుడు శ్రీరామునకు చేసిన బోధలాగుంది. అయినా శ్రీరాముడు దాన్ని అంగీకరించలేదు. తాను క్షత్రియుడే అయినా రాజ్యపాలన చేయటానికి ఆ సందర్భంలో ఆయన అంగీకరించలేదు. అరణ్యవాసం చేయటానికే నిశ్చయించుకున్నాడు. ఎందుకు? క్షత్రియునిగా క్షత్రియధర్మాన్ని నిర్వర్తించాలి కదా? ఎవరిని గర్చి ‘రామోవిగ్రహవాన్‌ ధర్మంః అని అన్నాడో ఆ రాముడే క్షత్రియ ధర్మాన్ని పాటించలేదు. ఎందుకు? శ్రీకృష్ణునికి తెలిపిన ధర్మం శ్రీరామునికి తెలియకనా? ఆయన ఏమని చెబుతాడో రామాయణ పుటలను తిప్పి చూద్దాం మరి. ‘ఓ భరతుడా! నీవ్ఞ శత్రుఘ్నునితో కలిసి అయోధ్యకు పోయేజనరంజకంగా పరిపాలించు.

    నేను సీతాలక్ష్మణులతో కలిసి వనవాసవ్రతం పూర్తి చేస్తాను. నీవ్ఞ పోయి కోసలదేశానికి రాజువ్ఞకా! ఆ దేశప్రజలందరినీ రక్షించు. నేను ఇక్కడ అరణ్యానికి రాజు అవ్ఞతాను. ఇక్కడ ఉండే పశుపక్ష్యాదులను, తపశ్శాలురను, మునీశ్వరులను రక్షిస్తాను. ఆ విధంగా అడవ్ఞల్లో ఉంటూ కూడా క్షత్రియధర్మాన్ని కాపాడుకుంటాను. అయోధ్యలో రాజువై తెల్లని గొడుగునీడలో రాజ్యపాలన చెయ్యి. నేను ఇక్కడ అరణ్యంలోని చెట్టునీడలలో ఉంటూ వన్యజీవాలను కాపాడుతూ ఉంటాను. అయోధ్యలో శత్రుఘ్నుడు నీకు తోడునీడగా ఉంటాడు. ఇక్కడ అరణ్యంలో లక్ష్మణుడు నాకు తోడునీడగా ఉంటాడు.మన నలుగురం మన తండ్రి దశరథ మహారాజు సత్యవ్రతాన్ని నిలబెడదాం (పుట 268-107 వసర్గ -అయోధ్యాకాండము, శ్రీమద్రామాయణం). దీన్ని గమనిస్తే భరతుడు చెప్పినది క్షత్రియధర్మాన్ని గూర్చి మాత్రమే. అయితే శ్రీరాముడు చెబుతున్నది క్షత్రియధర్మాన్ని గూర్చి, దానితోపాటు పుత్రధర్మాన్ని గూర్చి కూడా. మాతృదేవోభవ! పితృదేవోభవ! అని చెబుతుంది వేదం.

    దైవస్వరూపుడైన తండ్రి చేసిన వాగ్దానాలను నెరవేర్చటం, ఆజ్ఞలను పాటించటం పుత్రుల ధర్మం. కాబట్టి అరణ్యంలోనే ఉంటే క్షత్రియధర్మాన్ని, పుత్రధర్మాన్ని కూడా నిర్వర్తించినట్లవ్ఞతుందన్నది శ్రీరాముని అభిప్రాయం. అందుకే భరతుని మాటలను తిరస్కరించాడు. ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది. సమయం, సందర్భాన్ని బట్టి నిర్ణయించవలసి ఉంటుంది. యుద్ధం చేసి, శత్రువ్ఞలను సంహరించి, రాజ్యపాలన చేయటమే నీ కర్తవ్యమని అర్జునునకు శ్రీకృష్ణుడు చేసిన బోధ ధర్మమే. అభిషేకాన్ని తిరస్కరించి, రాజ్యపాలన చేయక, అరణ్యంలోనే ఉంటానని శ్రీరాముడు చెప్పిన మాట ధర్మమే. ధర్మనిర్ణయానికి విచక్షణాజ్ఞానం అత్యంత అవసరం. శ్రీమద్రామాయణ పఠనం మనలో దాన్ని పెంపొందించాలి.

----------------

నేను చచ్చిన తర్వాత రా

జనక మహారాజు గొప్ప వేదాంతి. అలాంటి జనకుడి దగ్గర వేదాంత విషయాలు నేర్చుకుని రావలసిందిగా ఓ గురువు, తన శిష్యుడైన ఓ యువకుడిని పంపించాడు. ఆ యువకుడు ఎంతో దూరం ప్రయాణం చేసి, జనకుడిని వెదుక్కుంటూ వచ్చాడు. అతను వచ్చే సమయానికి జనకుడు కొలువులో ఉన్నాడు. ఆ సమయంలో లోనికి వెళ్లడం భావ్యం కాదు కనుక ఈ యువకుడు, బయట ద్వారం దగ్గర ఉన్న కావలి వారికి ఒక చీటీ మీద ‘మీ వద్ద వేదాంత విషయాలను నేర్చుకుని రమ్మని మా గురువు గారు పంపించగా నేను వచ్చాను’ అని రాసి లోపలకు పంపించాడు. జనకుడు ఆ చీటీ చూసి, దాని వెనకాల ‘నేను చచ్చిన తర్వాత రండి’ అని రాసి తిరిగి పంపించాడు. ఆ యువకుడికి మతిపోయినంత పనైంది. ‘ఇదేంటి, నేను ఈయన దగ్గర వేదాంత రహస్యాలను తెలుసుకుందామని వస్తే ఈయనేమో తాను చచ్చిన తర్వాత రమ్మని అంటున్నాడు... అనుకుని నిరాశతో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడ ఒక చెట్టు కనిపిస్తే ప్రయాణ బడలిక, ఆకలి, దప్పికలతో సొమ్మసిల్లినట్లు పడుకున్నాడు. కాసేపటి తర్వాత మెలకువ వచ్చి ఒక సత్రం కనిపిస్తే అక్కడికి వెళ్లాడు. కొంత సొమ్ము చెల్లించి, ఆకలి దప్పికలు తీర్చుకున్నాడు. మరునాడు మళ్లీ రాజు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ రాజ దర్శనం కాలేదు. ప్రతిసారీ తాను వచ్చానని కావలి వారితో కబురు పెట్టడం, రాజు ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపెయ్యడం... అలా కొన్ని రోజులు గడిచాయి. కుటుంబ సభ్యులు గుర్తుకు వస్తున్నారు. దేని మీదా ధ్యాస నిలవడం లేదు. తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నాడు. 

ఒక్కోసారి తనను అంత దూరం పంపించినందుకు గురువు మీద కోపం వచ్చి పెద్దగా తిట్టుకుంటున్నాడు. గొణుక్కుంటున్నాడు. చివరికి తెచ్చుకున్న సొమ్మంతా అయిపోయింది. ఆకలితో నకనకలాడుతూ చెట్టుకింద కూర్చున్నాడు. అతని పరిస్థితి చూసి జాలిపడి ఎవరో తినడానికి ఏదో పెట్టబోయారు. అతనికి కోపం వచ్చింది. ‘నేనేమైనా అడుక్కునేవాడినా’ అని కసిరి పంపించేశాడు. అలాగే మునగదీసుకుని పడుకున్నాడు. ఆకలితో నిద్ర పట్టలేదతనికి. మరునాడు మళ్లీ ఎవరో ఏదో పెట్టడానికి ప్రయత్నించారు. ఈసారి కాదనలేదు. చేతులు చాచి ఆత్రంగా అందుకుని తినేశాడు. ఈసారి అతనికి ఆకలి తీర్చుకోవాలన్న ఆరాటం తప్ప తానెవరో, ఎక్కడినుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో గుర్తురాలేదు. ఆకలి తీరాక దుస్తులు తడుముకుంటుంటే చీటీ ఏదో చేతికి తగిలింది. తెరిచి చూశాడు. అప్పుడు స్ఫురించిందతనికి రాజు గారు చెప్పిన మాటల్లోని భావం... ‘నేను చచ్చిన తర్వాత’ అంటే ‘నేను’ అనే భావన నశించిపోవాలన్న సంగతి. దాంతో అతనికి ఇక రాజుగారి దగ్గరకు తిరిగి వెళ్లవలసిన అవసరం కలగలేదు. గొప్ప వేదాంతి అయ్యాడు.   – డి.వి.ఆర్‌.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment