ప్రశ్నచండేశ్వరం | Prasna Chandeswaram | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ప్రశ్నచండేశ్వరం 
Prasna Chandeswaram
Rs 63/-
ప్రశ్నచండేశ్వరం | Prasna Chandeswaram | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ప్రశ్న శాస్త్రం ద్వారా 
తప్పిపోయిన వాళ్ళను కనుక్కోవటం

ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహములస్ధితి ఆ ప్రశ్న గురించిన వివరములు మరియు ఆ ప్రశ్న యొక్క భవిష్యత్తు తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధిచెందింది.జాతకంలోని ఒక అంశము యొక్క సూక్ష్మ కాల నిర్ణయము ప్రశ్న ద్వారా మాత్రమే సాద్యపడుతుంది.రెండు అంశాలలో దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగ పడుతుంది.ప్రశ్నించని వానికి ఫలాదేశం చెప్పకూడదు.ప్రశ్నకు ప్రశ్నాశాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు.

ప్రశ్న అడిగినవారు వారి తాలూకు బంధువులు లేదా సన్నిహితులు అయి ఉండి వారు ఊరు ప్రయాణమై వెళ్లి వారి జాడ తెలియని సందర్భంలో.. తత్కాల ప్రశ్న లగ్నం ఆధారంగా చెప్పవచ్చు.సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, చాలాకాలం సందేశాలు రానప్పుడు ‘వెళ్లినవారు ఏమయినారో’ అనే విషయంగా ప్రశ్న అడుగుతుంటారు.


లగ్నానికి సంబంధంగా ఉన్న షడ్వర్గులు హోర, ద్రేక్కాణ, సప్తాంశ, ద్వాదశాంశ, నవాంశ, త్రిశాంశలు నిర్ధారణ జరపాలి. ప్రశ్న అడిగిన లగ్నం స్దిర రాశులైన వృషభ, సింహ, వృశ్చిక, కుంభ రాశులలో ఒకటి అయి షడ్వర్గులు కూడా అధికంగా స్థిర వర్గులు వస్తే అప్పుడు ఆ వ్యక్తి వెళ్లిన చోట స్థిరముగా ఉన్నారు అని చెప్పవచ్చు. ఎటువంటి సమస్యా లేదని కూడా చెప్పచ్చు.

చర రాశులైన మేష, కర్కాటక, తుల, మకరములలో ఒకటి లగ్నము అయి ఎక్కువ షడ్వర్గులు చర వర్గులు అయిన యెడల వెళ్లిన మనిషి వెళ్లిన చోట స్థిరముగా లేరు అని చెప్పాలి.తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉండచ్చు.

ద్విస్వభావ రాశులు అయిన మిథున, కన్య, ధను, మీన రాశులలో ప్రశ్న అడిగిన యెడల వెళ్లిన వ్యక్తి యొక్క లక్షణము కూడా చంచల్యము ద్వంద్వముగా వున్నది అని చెప్పవలెను. లగ్నమును పూర్ణ చంద్ర, బుధ, గురు, శుక్రులలో ఎవరు చూచిననూ లేదా లగ్నములో వున్ననూ సంపూర్ణ శుభ ఫలము చెప్పవలెను. అనగా వెళ్లినచోట సుఖముగా వున్నారు. ఇబ్బంది పడటం లేదు అని చెప్పాలి.

లగ్నములో పాపగ్రహములు వున్నను, పాప గ్రహములు లగ్నమును చూచినను వెళ్లిన చోట మనిషి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. స్థిర లగ్నములలో పాప గ్రహములు వున్నవి అనుకోండి మనిషి వెళ్లినచోట స్థిరముగా ఉండి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. అదే రీతిగా శుభగ్రహాలు వున్న చర లగ్నంలో ప్రశ్న అడిగిన యెడల చలనం కోరుకుంటున్నారు. అది మంచి ఫలితమే సూచించనున్నదని చెప్పాలి.

ద్విస్వభావ లగ్నాలకు పాపగ్రహం సంబంధం పాప ఫలితాలను, శుభ గ్రహ సంబంధం శుభ ఫలితాలను సూచిస్తుంది. లగ్నాధిపతితో కలిసి 5 డిగ్రీలలో వేరే ఏదేని గ్రహం ఉన్న యెడల వెళ్లిన వ్యక్తికి తోడుగా వేరేవారు కూడా వున్నారు అని చెప్పచ్చు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment