హెల్త్ ఫైల్ | Health File | GRANTHANIDHI Kidney Problems , Health Benefits  , Health Tips  , Nutrition  , Immunity Power ,| MOHANPUBLICATIONS | bhaktipustakalu

హెల్త్ ఫైల్ 
 Health File
144/-

Kidney Problems , Health Benefits  , Health Tips  , Nutrition  , Immunity Power ,

మన శరీరంలో ముఖ్యమైన కర్మాగారం

మన శరీరంలోని ఒక అవయవాన్ని కొంత కట్‌ చేసి తొలగించినా మళ్లీ పెరుగుతుంది. అది ఏ అవయవమో తెలుసా? అది మన శరీర అంతర్గత అవయవాల్లో అతి పెద్దది. అంతేకాదు, అతి ముఖ్యమైన అవయవం కూడా! దాని పేరేంటో గుర్తొచ్చిందా? కాలేయం. ఇంతకీ కాలేయం ఏం పనిచేస్తుంది? దాని గొప్పతనం ఏంటి

శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం. ఎరుపు, గోధుమ వర్ణంలో రెండు భాగాలుగా ఉంటుంది. వీటిని లోబ్స్‌ అంటారు. కాలేయం పెద్దవారిలో 1.4 కేజీల బరువు ఉంటుంది. రెండు పెద్ద రక్తనాళాలు లివర్‌కు రక్తాన్ని తీసుకొస్తాయి. అవి హెపాటిక్‌ ఆర్టరీ, పోర్టల్‌ వెయిన్‌. హెపాటిక్‌ ఆర్టరీ గుండె నుంచి నేరుగా ఆక్సిజన్‌ సహిత రక్తాన్ని తీసుకొస్తుంది. పోర్టల్‌ వెయిన్‌ కూడా రక్తాన్ని తీసుకొస్తుంది. కానీ చిన్న పేగుల్లో నుంచి జీర్ణమైన ఆహారాన్ని కూడా తీసుకొస్తుంది. ఈ రెండు పెద్ద రక్త నాళాలు కాలేయంలో ప్రవేశించాక చిన్న చిన్న రక్తనాళాలుగా విడిపోతాయి. కాలేయంలో 96 శాతం నీరే ఉంటుంది. కాలేయ కణజాలాల్లో ఆ నీరు నిలువ ఉంటుంది.

ఏం పనిచేస్తుంది?
కాలేయం చాలా రకాల పనులు చేస్తుంది. మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమయి, శరీరానికి శక్తి రూపంలో అందేలా చేయడంలో కాలేయం పాత్ర కీలకం.

ఆహారం ద్వారా, మందుల ద్వారా శరీరంలోకి ప్రవేశించిన టాక్సిన్స్‌ను తొలగించడంలోనూ కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది.

తీసుకున్న ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్‌ నుంచి గ్లూకోజ్‌ను తయారుచేస్తుంది. ఇందులో కొంత గ్లూకోజ్‌ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు అందుతుంది. ఇంకొంత గ్లూకోజ్‌ గ్లైకోజెన్‌ రూపంలో కాలేయంలో నిలువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పరుగెత్తినప్పుడు, ఎక్కువ పని చేసినప్పుడు ఈ గ్లైకోజెన్‌ విడుదలయి శరీరానికి కావలసిన అదనపు శక్తి లభిస్తుంది.

రక్తంలో ఉన్న టాక్సిన్లను తొలగించే ప్రక్రియను కాలేయమే నిర్వర్తిస్తుంది.

పైత్యరసాన్ని విడుదల చేస్తుంది. ఇది ఆహారం జీర్ణం కావడంలోనూ, కొవ్వుని శరీరం గ్రహించేలా చేయడంలోనూ సహాయపడుతుంది.

ప్రొటీన్స్‌ను అమైనోయాసిడ్స్‌గా మారుస్తుంది. విటమిన్లు, మినరల్స్‌ను నిలువ ఉంచుకుంటుంది.
జ్వరం వచ్చినపుడు మందులు వేసుకుంటారు కదా! ఆ మందులలో ఉన్న పదార్థాలను విడగొట్టే పనిని కాలేయమే చేస్తుంది.

కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ నియంత్రించే పని చేస్తుంది.

ఎలాంటి జబ్బులొస్తాయి?
శరీరంలో ముఖ్య అవయవం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అతిగా మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కొన్ని రకాల వైర్‌సల వల్ల కాలేయం పనితీరు దెబ్బతింటుంది. వాటిలో హెపటైటి్‌స-ఎ, హెపటైటి్‌స-బి,
హెపటైటి్‌స-సి ముఖ్యమైనవి.

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్‌ తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

కాలేయంలో కొంత భాగం దెబ్బతిన్నప్పుడు డాక్టర్లు ఆ భాగాన్నితొలగిస్తారు. అలా

తొలగించినా ఏమీ కాదు. ఎందుకంటే ఆ తొలగించిన భాగం మేరకు కాలేయం మళ్లీ పెరుగుతుంది.

వాక్సిన్‌ తీసుకోవాలి

హెపటైటిస్‌ - బి వ్యాక్సినేషన్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్‌ను అందరూ తప్పక తీసుకోవాలి.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

1 comment:

  1. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!

    మన శరీరంలో మూత్ర పిండాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను తొలగించడంలో వాటి పాత్ర అమోఘమైంది. కానీ నేటి తరుణంలో అనేక కారణాల వల్ల చాలా మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో పిన్న వయస్సులోనే కొందరికి కిడ్నీలు ఫెయిలై పరిస్థితి తీవ్రంగా మారుతున్నది. అయితే అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఎవరైనా సరే తమ కిడ్నీల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. అందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

    1. నిత్యం 7 నుంచి 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగాలి. దీంతో శరీరంలో ఉండే మలినాలు బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. లేదంటే అవి మన శరీరంలో ఇతర అవయవాలకు కూడా హాని కలిగిస్తాయి. కిడ్నీ వ్యాధులను తెచ్చి పెడతాయి.

    2. ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను తరచూ తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ ఎ, సి, పొటాషియం తదితర పోషకాలు కిడ్నీల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.

    3. నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.

    4. రోజుకో యాపిల్ పండును తింటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. యాపిల్ పండ్లలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తాయి.

    5. పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ బి, డి లు కిడ్నీ వ్యాధులు రాకుండా చూడడంతోపాటు కిడ్నీలను సంరక్షిస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

    6. స్ట్రాబెర్రీలలో ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే మలినాలను బయటికి పంపి కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీటిని తరచూ తింటుంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

    7. ఓట్స్, కాలిఫ్లవర్, ఉల్లిపాయలు, పైనాపిల్స్ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తాయి. వీటిని రోజూ తింటుంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

    ReplyDelete