ఫుడ్ థెరఫి | Food Therapy | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ఫుడ్ థెరఫి 
Food Therapy
Rs 63/-


మర్దన మహత్తు!కేరళ ఆయుర్వేద వైద్యం అనగానే ఎవరికైనా మొదట ఆయిల్‌ మసాజ్‌ స్ఫురిస్తుంది. నూనె పట్టించి మర్దనా చేయించుకుంటే నొప్పులు వదిలి హాయిగా ఉంటుంది కాబట్టి, మంచిదే అనే అభిప్రాయం కూడా అందరిలో ఉంది. కానీ తైల మర్దన అనేది మనకున్న అవగాహనకు మించి ఉపయోగకరమైనది. శరీరతత్వం ఆధారంగా, రుగ్మత మూలాల్లోకి వెళ్లి, ఎంచుకోగలిగిన తైల మర్దనాలు లెక్కలేనన్ని! వాటి ఫలితాలూ లెక్కించలేనన్ని!


ఆయుర్వేద చికిత్సలో ఎలాంటి రుగ్మతకు చికిత్స చేయాలన్నా, దాన్ని పంచకర్మ అంటారు. దాని ఫలితం పూర్తిగా శరీరానికి దక్కాలంటే ముందుగా శరీరాన్ని విషరహితంగా మార్చాలి. ఇందుకోసం ‘పూర్వకర్మ’ చికిత్సను అనుసరించక తప్పదు. ఈ చికిత్సలో భాగంగా దేహాన్ని విషరహితంగా మార్చడం కోసం బాహ్యంగా, అంతర్గతంగా తైలాలను వాడతారు. బాహ్యంగా తైల మర్దన చేయవలసి ఉంటుంది. అంతర్గతంగా తైలాలను తాగవలసి ఉంటుంది. తైల మర్దన చికిత్సలన్నీ రోగుల రుగ్మతలు, వారి శరీరతత్వాల ఆధారంగా ఎంచుకోవలసి ఉంటుంది. చికిత్సల్లో కొన్ని నిర్దిష్ట నూనెలు, చూర్ణాలు, మర్దన పద్ధతులు అనుసరిస్తారు. వీటిని ఆయుర్వేద తైల చికిత్సలు అంటారు. వీటిని శరీరతత్వం (వాత, పిత్త, కఫ), రుగ్మతల ఆధారంగా ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు. అవేంటంటే....


అభ్యంగనం
సాధారణంగా మనం ఇంట్లో కూడా తైల మర్దన చేసుకుంటూ ఉంటాం. దీని ప్రథమ ఉద్దేశం రక్తప్రసరణ పెరుగుదల, కండరాలు, చర్మ పటుత్వాలే! మర్దన వల్ల శరీరంలోని మలినాలు కూడా విసర్జితమై శక్తి పెరుగుతుంది. మంచి నిద్ర పడుతుంది. ఇలా ఒళ్లంతా నూనె పట్టించి మర్దన చేసి, సున్ని పిండితో రుద్ది స్నానం చేసే పద్ధతిని ఆయుర్వేదంలో ‘అభ్యంగనం’ అంటారు. ఇది ఎవరైనా చేయొచ్చు. అయితే ఆయుర్వేద చికిత్సలో భాగంగా పూర్వకర్మ అభ్యంగనను మున్ముందు చికిత్సకు శరీరాన్ని సంసిద్ధం చేయడం కోసం చేస్తారు.


చూర్ణాలు... రకాలు...
వ్యాధి, శరీరతత్వం ఆధారంగా మర్దన కోసం ఉపయోగించవలసిన నూనెలు, చూర్ణాలు ఎంచుకోవలసి ఉంటుంది. కాబట్టి మర్దన నూనెల్లో లెక్కలేనన్ని రకాలు వాడుకలో ఉన్నాయి. అయితే పొడుల్లో ఔషధంలా తీసుకునే పొడులు బోలెడన్ని. శరీరం మీద మర్దనకు వాడేవి మూడు లేదా నాలుగు రకాలుంటాయి. వీటిలో...


కోలగులతాది చూర్ణం: కొవ్వును కరిగించడంతోపాటు, కొవ్వు కరిగే వేగాన్ని పెంచి, అధిక బరువును తగ్గిస్తుంది.
త్రిఫలాది చూర్ణం: రక్తప్రసరణ మెరుగవుతుంది.
జడామయాది చూర్ణం: కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఏలాది చూర్ణం: చర్మ సంబంధ సమస్యలకు ఉపయోగకరం.


ఉద్వర్తనం


ఈ మర్దన పురుషుల కోసం ఉద్దేశించినది. ఏమాత్రం తడి లేకుండా పూర్తిగా చూర్ణాలతో సాగే ఈ మర్దన సున్నిత చర్మం కలిగి ఉండే మహిళలకు పనికి రాదు. కాబట్టి ఉద్వర్తనం మినహా ఉద్ఘర్షణం, ఉత్సాదనం మర్దనలు మాత్రమే మహిళలకు ఉద్దేశించినవి. పిల్లల చర్మం మరింత సున్నితంగా ఉంటుంది కాబట్టి పూర్తి నూనెలతో సాగే ఉత్సాదనం మర్దన ఒక్కటే వారికి అనుసరించవలసి ఉంటుంది. ఈ చికిత్సతో రక్తప్రసరణ, మెటబాలిక్‌ రేట్‌, మరీ ముఖ్యంగా కొవ్వు కరిగే వేగం పెరుగుతాయి.


ఉద్ఘర్షణం
ఇది తడి చూర్ణాలతో చేసే మర్దన. కీళ్ల దగ్గర వృత్తాకారంలో, ఎముకల దగ్గర పొడవుగా సాగే ఈ మర్దన రెండు రకాల మర్దన పద్ధతుల్లో సాగుతుంది. కఫ తత్వ లక్షణాలైన అధిక బరువు, ఒంట్లో నీరు నిల్వ ఉండిపోవడం, నిస్తేజం, రక్తప్రసరణ లోపం ఉన్న వారికి ఉద్ఘర్షణం వల్ల ఫలితం ఉంటుంది. దీర్ఘకాలంలో శరీరంలోని కలుషితాలన్నీ విరిగి రక్తప్రవాహంలో కలుస్తాయి. ఫలితంగా కొవ్వు కూడా కరగడం మొదలు పెడుతుంది.


శిరోధార
ఈ చికిత్సలో శరీరానికి తైల మర్దన చేసి, ఆ తర్వాత నుదుటి మీద తైలం చుక్కలుగా పడే చికిత్స చేస్తారు. ఇలా నూనె నేరుగా నుదుటి మీద పడడం వల్ల మెదడులోని పిట్యూటరీ గ్రంథి పనితీరు మెరుగవుతుంది. శిరోధార చికిత్సను క్రమం తప్పక తీసుకుంటే మెదడులో సెరటోనిన్‌, డోపమైన్‌ హార్మోన్లు సక్రమంగా స్రవిస్తాయు. పార్కిన్సన్‌ రుగ్మతలో డోపమైన్‌ లెవెల్స్‌ తగ్గుతాయి. అలాంటివాళ్లకి ఈ చికిత్స ఫలితమిస్తుంది. శిరోధార వల్ల కార్టిసాల్‌, సెరటోనిన్‌ స్రావాలు మెరుగవుతాయి. కాబట్టి ఒత్తిడి వల్ల తలెత్తే రుగ్మతలకు ఈ చికిత్స చక్కని ఫలితాలనిస్తుంది. నిద్రలోపం కూడా తొలగుతుంది.


కషాయధార
చూర్ణాలతో తయారైన కషాయాన్ని శరీరం మీద ఒంపి, నొప్పులు, వాపులను తొలగించే చికిత్స ఇది. సమమైన వేడితో ఉన్న కషాయాన్ని శరీరం మీద, రెండు వైపులా ఒకే దిశలో పోస్తూ ఈ చికిత్స చేస్తారు. వాపులు, నొప్పులు ఉన్నప్పుడు ఈ చికిత్స చేయుంచుకోవడం వల్ల కషాయంలోని మూలికలు ఆ నొప్పులకు కారణాలను నేరుగా చేరుకుని చికిత్స చేస్తాయి. ఊపిరితిత్తుల్లో, పొట్టలో నీరు పేరుకుపోయే ఎడిమా సమస్యకూ ఈ చికిత్స చక్కని ఫలితం ఇస్తుంది.


ఎలాంటి తైలం వాడాలంటే..

గోరువెచ్చని నూనెను చర్మం తేలికగా పీల్చుకుంటుంది. కాబట్టి మర్దన కోసం వాడే నూనెను వేడి చేస్తారు. అయితే ఈ నూనెను పొయ్యి మీద ఉంచి నేరుగా వేడి చేయకూడదు. గిన్నెను వేడి చేసి, పొయ్యి నుంచి దింపి, ఆ తర్వాత దాన్లో నూనె నింపవలసి ఉంటుంది. నూనె చల్లారిపోతే, తిరిగి గిన్నె ఖాళీ చేసి వేడి చేసి, నూనెను నింపాలి. ఇలా చేయకుండా నూనెను నేరుగా పొయ్యి మీద ఉంచి వేడి చేసినా, అదే పద్ధతిలో పదే పదే వేడి చేసినా తైలంలోని విలువైన ఔషధ గుణాలు నష్టమవుతాయి. చూర్ణాలను చిన్న మంట మీద వేడి చేయాలి.
- డాక్టర్‌ ప్రియా దేవి. ఎన్‌, ఆయుర్వేద వైద్యులు, కైరళి ఆయుర్వేదిక్‌ విలేజ్‌, పాలక్కాడ్‌, కేరళ


కాయసేగం
శరీరం మొత్తాన్నీ తైలాలతో మర్దన చేసే ఈ చికిత్స వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది. పక్షవాతం, మస్క్యులర్‌ డిస్ట్రోఫీ సమస్యలకు కాయసేగం ఫలితాన్నిస్తుంది.
-గోగుమళ్ల కవిత

........................


నేచురల్ హెయిర్ థెరఫీలతో


తెల్ల జుట్టుకు గుడ్ బై..
ఈ మోడ్రన్ లైఫ్ స్టైల్లో జుట్టు సమస్యలు అధికం. ముఖ్యంగా ఈ సమస్యల్లో వైట్ హెయిర్ తో చాలా మంది బాధపడుతున్నారు. నలుగురిలో అందంగా కనిపంచమనే భావనతో నలుగురిలోకి కలవకుండా ఉండే వారు ఉన్నారు. జుట్టు సమస్యల్లో బట్టతల మరియు తెల్ల జుట్టు ఈ రెండు సమస్యలు మనిషి యొక్క వ్యక్తిగత జీవితాన్ని క్రుంగదీస్తుంది.

గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్

ప్రతి సారి అద్దం ముందు నిలబడ్డటప్పుడు, బాధపడటం తప్ప ఏం చేయలేని పరిస్థితి. తెల్ల జుట్టును కప్పి పుచ్చుకోవడానికి ఎన్నో చిట్కాలను, ట్రీట్మెంట్స్ ను మరియు కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించినా ఫలితం శూన్యం. ఇలా చిన్న వయస్సులో జుట్టు తెల్లగా మారడం వల్ల పెద్దవారిగా..వయస్సైన వారిలా కనబడుతుంటారు. . 30 నుండి 20 మద్యలో ఇలా తెల్లజుట్టును గమనించినట్లైతే చాలా బాధకరం అనిపిస్తుంది.

తెల్ల జుట్టుకు అనేక కారణాలున్నాయి . తెల్ల జుట్టు నివారణకు మనం తీసుకొనే జాగ్రత్తలకంటే ముందు తెల్లజుట్టుకు ప్రధాణ కారణలేంటో తెలుసుకుందాం... తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు.. మెలనిన్ తగ్గిపోవడం: తలలో మెలనిన్ లోపించడం వల్ల తెల్ల జుట్టు అధికం అవుతుంది, . ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ లోపం వల్ల మెలనిన్ లోపిస్తుంది. తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు.. ఒత్తిడి : ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్(చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణం ఒత్తిడి . జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం మరియు ఆల్కహాల్ కూడా .. తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు.. కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్: కొన్ని సందర్భాల్లో కెమికల్ బేస్డ్ షాంపు, సోపులు, హెయిర్ డైలు తలకు వాడటం వల్ల నేచుగా తెల్ల జుట్టుకు కారణం అవుతుంది . అలాగే కొన్ని అలర్జిక్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణం అవుతుంది. తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు.. . జెనిటిక్ డిజార్డర్స్: అదే విధంగా : జెనిటిక్ డిజార్డ్స్ వల్ల కూడా ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ కు దారితీస్తుంది. తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు.. తెల్ల జుట్టుకు కారణం ఏదైనా నివారించడంలో కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ నేచురల్ రెమెడీస్ మన ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి . కాబట్టి వీటితో తెల్లజుట్టును నివారించుకోవడం ఎలాగో తెలుసుకుందాం,.... ఆమ్లా: ఇండియన్ గూస్బ్రెర్రీ లేదా ఆమ్లా లేదా ఉసిరికాయ . తెల్ల జుట్టును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . మీ హోం రెమెడీస్ లో ఎండిన ఉసిరికాయను కూడా ఉపయోగించుకోవచ్చు . ఉసిరికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి తర్వాత రోజూ ఈ నూనెతో తలకు మసాజ్ చేయాలి . అలాగే కొద్దిగా ఎండిన ఉసిరికాయ పొడి, నిమ్మరసం, బాదం ఆయిల్ ను మిక్స్ చేసి తలకు ప్యాక్ వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. 

క్యారెట్ సీడ్స్ మరియు నువ్వుల నూనె థెరఫీ: అరటీస్పూన్ క్యారెట్ ఆయిల్ ను 4 చెంచాలా నువ్వుల నూనెలో మిక్స్ చేసి , తలకు అప్లై చేసి హెయిర్ రూట్స్ నుండి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రాదు మరియు హెయిర్ కు నేచురల్ కలర్ వస్తుంది . ఆరెండింటి మిశ్రమాన్ని తలకు పట్టించి కొద్దిసేపటి తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి. బ్లాక్ టీ: బ్లాక్ టీ చాలా సింపుల్ రెమెడీ. వైట్ హెయిర్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ . రెండు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీని బాయిల్ చేసి . తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేయాలి . 

గమనిక: షాంపు ఉపయోగించకూడదు. కరివేపాకు మరియు కొబ్బరి నూనె థెరఫి: అరకప్పు కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా ఉగికించాలి. బాగా ఉడికించిన తర్వాత స్టెయినర్ తో వడగట్టుకోవాలి . గోరువెచ్చగా అయ్యాక తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. మైల్డ్ షాంపుతో శుభ్రం చేసుకోవాలి. ఈ థెరఫీని కొన్ని వారాల పాటు అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది. సేజ్ లీవ్స్ థెరఫీ : నేచురల్ హెయిర్ కలర్ ను తిరిగి పొందడాినకి కొన్ని సేజ్ లీవ్స్ ను వాటర్ లో వేసి బాయిల్ చేయాలి. తర్వాత గోరువెచ్చగా మారిన తర్వాత తలకు మరియు కేశాల పొడవునా చిలకరించాలి . 2 గంటల తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేసుకోవాలి. కొన్ని వారాల తర్వాత తిరిగి ఇలా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

బీరకాయ థెరఫీ : అరకప్పు బీరకాయ ముక్కలు తీసుకొని, సన్నగా కట్ చేసి, ఎండబెట్టాలి. తర్వాత వాటిని అరకప్పు కొబ్బరి నూనెలో వేసి 4-5రోజులు బాగా నానబెట్టాలి. తర్వాత ముక్కలతో పాటు, నూనెను మరిగించాలి. బీరకాయ ముక్కలు నల్లగా మారే వరకూ మరిగించి వడగట్టుకోవాలి. గోరువెచ్చగా మారిన తర్వాత తలకు అప్లై చేయాలి. ఇలా వారానొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది . 

మజ్జిగ మరియు కరివేపాకు థెరఫీ: ఆయిల్ హెయిర్ కు ఇది ఎఫెక్టివ్ హోం ట్రీట్మెంట్ . ఒక కప్పు మజ్జిగలో , ఒక కప్పు కరివేపకు జ్యూస్ మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని కొన్ని నిముషాలు వేడి చేసి , గోరువెచ్చగా తలకు పట్టించి , ఒక గంట సేపు అలాగే ఉంచాలి . తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టును నివారించుకోవచ్చు. 

మెంతులతో హెయిర్ థెరఫీ: సౌత్ ఇండియాలో తెల్లజుట్టు నివారణకు ఉపయోగించే రెమెడీస్ లో ఇది ఒక పవర్ ఫుల్ హోం రెమెడీ.ప్రతి రోజూ ఉదయం మెంతులతో తయారుచేసిన మెలకలను తినవచ్చు, లేదా మెంతులు నానబెట్టిన నీటిలో ప్రతి రోజూ ఉదయం తాగాలి. లేదా మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం మెత్తగా పేస్ట్ చేసి తలకు ప్యాక్ చేసుకోవడం వల్ల తెల్ల జుట్టును నివారించుకోవచ్చు. 

హెన్నా థెరఫీ: జుట్టు సమస్యలను నివారించడంలో హెన్నా గ్రేట్ గా సహాయపడుతుంది . హెన్నాను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు . హెన్నా పౌడర్ ను పెరుగు, మెంతులు, తులసి, మరియు పుదీనా రసంతో స్మూత్ పేస్ట్ లా చేసుకొని తలకు ప్యాక్ వేసుకోవాలి. అలాగే మరో రెమెడీ. పెరుగు, కాఫీ, నిమ్మరసం, క్యాటచ్యు, ఆమ్లా పౌడర్, వెనిగర్, మరియు పుదీనా పౌడర్ అన్నీ ఒక్కోక్క స్పూన్ తీసుకొని, మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి . 1గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. నువ్వుల నూనె మరియు బాదం ఆయిల్: వైట్ హెయిర్ నివారించడంలో ఇది మరో బెస్ట్ నేచురల్ రెమెడీ. ఒక స్పూన్ నువ్వుల నూనెకు 4 చెంచాల బాదం నూనెను మిక్స్ చేసి తలకు పట్టించి, అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి . వైట్ హెయిర్ కు నివారించడంలో మంచి ఫలితాలను అందిస్తుంది.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment