ధర్మ సందేహాలు | Dharma Sandehalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ధర్మ సందేహాలు 
 Dharma Sandehalu
Rs 210/-
పుణ్యస్య ఫలమిచ్ఛంతి..


    భారతదేశంలో యుగయుగాలుగా బహుముఖీనమై జాలువారిన తాత్విక చింతనా ధార, వెల్లువెత్తిన వేద విజ్ఞానం, తత్ఫలితంగా రూపుదిద్దుకున్న సమున్నత సంస్కృతీసంప్రదాయాలు మానవ జీవన స్రవంతిని పరిమళభరితం చేయగల అనేక ఆచరణీయ అంశాలను ప్రతిపాదిస్తూ వచ్చాయి. జీవితంలో విధిగా పాటించవలసిన, పాటించకూడని విహిత, అవిహిత కర్మలకు సంబంధించి విస్పష్టమైన వివరణ ఇవ్వబడింది. వైయక్తిక, కుటుంబపర, సామాజిక జీవన విధివిధానాలు నిష్కర్షగా కట్టడి చేయబడినాయి. సగటు మనిషి హాయిగా ఆనందంగా జీవించటానికి అనువైన ఆచార వ్యవహారాలు సత్సంప్రదాయాలు ఆవిష్కరించబడినాయి.

   ఇలాంటి జనహిత జీవన సూత్రాలు కాలగమనంలో వన్నె తగ్గి కనుమరుగై పోకుండా ఉండటానికే.. శాస్త్రవచనాలు, పురాణ, ఇతిహాసాల రూపంలో నిక్షిప్తం చేయబడినాయి. అలాంటివాటిలో రెండు భావనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు మనకు అర్థం అవుతుంది. ఆ రెండూ.. పాపపుణ్యాలు. వేద వ్యాస మహర్షి ఈ రెండు భావనలకూ చక్కటి అర్థం చెప్పారు. పుణ్యమంటే మనస్పూర్తిగా ఇతరులకు ఉపకారం చేయడం. ‘పాపం’ అంటే ఇతరులకు అపకారం చేయటం. మొదటిది విహిత కర్మ, విద్యుక్త ధర్మం. తప్పక చేయవలసినది. రెండోది అవిహిత కర్మ. అంటే చేయతగనిది. విచిత్రమేంటంటే పాప, పుణ్యాలకు అర్థం తెలియని వారెవరూ లేరు. కానీ ఆచరించేవారు తక్కువ.

పుణ్యస్య ఫలమిచ్ఛంతి - పుణ్యం నేచ్ఛంతి మానవ
నపాప ఫలమిచ్ఛంతి - పాపం కుర్వంతి యత్నితః

..అని శాస్త్ర వచనం. సగటు మానవ నైజాన్ని నిర్మొహమాటంగా ఉన్నదున్నట్లు పట్టిచూపే శ్లోకమిది. మధురమైన ఫలాలను ఆశిస్తూనే అలాంటి చెట్టు వైపు కన్నెత్తి చూడకుండా.. చేదు ఫలాలు వద్దనుకుంటూనే అలాంటి చెట్టును ఆత్రంగా ఎగబాకే ప్రయత్నం చేయటం వంటి విచిత్రమైన పరిస్థితి ఇది. ఇట్లా ఎందుకు జరుగుతున్నది? విహిత కర్మలకు బదులు అవిహిత కర్మలు చేయడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? అంటే.. పుణ్యప్రదమైన పరోపకార్యాలకు ఉపక్రమించాలంటే త్యాగభావం అవసరం. ఇతరుల కొరకు తన సొమ్మును సమయాన్ని వెచ్చించటానికి వెనుకాడని మనస్తత్వం అవసరం. ఇతరుల ఆనందంలో మన ఆనందాన్ని వెదుక్కోగల ఔదార్యం అవసరం. పరోపకారం చేయటం ప్రారంభిస్తే గాని అందులోని మాధుర్యం అనుభవంలోకి రాదు. మన ఆలోచనా విధానంలో మార్పురాదు. వ్యక్తిత్వం వికసించదు.
- మాదిరాజు రామచంద్రరావు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

1 comment:

  1. Guru gariki namskaram can we construct house during daughter pregnancy

    ReplyDelete