బతుకమ్మ ఉయ్యాల పాటలు | Bathukamma Uyyala Patalu |mictv, mangli, Bathukamma Songs 2018 Bangaru Bathukamma, Bathukamma dj songs, Bathukamma Festival, Bathukamma flowers, Bathukamma full song, Bathukamma making, Bathukamma Song 2018, Bathukamma songs, Bathukamma video songs, Bathukamma, Bathukmma videos, best bathukamma song 2018, Hyderabadi Bathukamma, Mangli Bathukamma, Mic Tv Bathukamma Song 2018, Mic Tv Special Song, Pedda Bathukamma, Saddula Bathukamma, Telangana Bathukamma Songs, telangana songs, bathukamma patalu,|  GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
బతుకమ్మ ఉయ్యాల పాటలు 
Bathukamma Uyyala Patalu
Rs.36/-
పూల పండుగ బతుకమ్మ!



తెలంగాణా సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప వేడుక... బతుకమ్మ పండుగ. ఆంధ్రప్రాంతంలో దసరా ఉత్సవాలు జరిగే సమయంలో తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుగుతుంది. ఈ పండుగలో ప్రధాన దేవత పరాశక్తి.


ఈ నెల 9 నుంచి బతుకమ్మ పండుగ

తెలంగాణ ప్రాంతంలో గౌరికి ప్రతీకగా ‘బతుకమ్మ’ను ఆరాధిస్తారు. ఆంధ్రప్రాంతంలో ‘దుర్గ’గా పూజిస్తారు. ఆశ్వయుజమాసంలోనే ఈ పండుగలు నిర్వహిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ‘బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్యనాడు ప్రారంభమై, నవమితో ముగుస్తోంది. దసరా పండుగ శుక్లపాడ్యమితో మొదలై దశమినాడు పరిసమాప్తమౌతుంది. పిలిచినా, పిలవకున్నా బతుకమ్మ పండుగ వస్తోందంటే ఇంటి ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకుంటారు. ప్రకృతి అంతా పూలవనమై అలరారుతుంది. వర్షాకాలం ముగియడంతో చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారి బతుకమ్మకు స్వాగతం పలుకుతున్నట్టుంటాయి. బతుకమ్మ పండుగను పెళ్లికాని యువతులు మంచి భర్తలను పొందాలనీ, పెళ్లయిన మహిళలు సత్సంతానాన్నీ, కలకాలం ఐదవతనాన్నీ పొందాలని మొక్కుకుంటూ ఘనంగా చేసుకుంటారు. ఈ పండుగకు సంబంధించిన కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి.

పార్వతీదేవి సాక్షాత్కారం!
పార్వతీదేవిని బతుకమ్మ పేరుతో పూజిస్తారని ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. దక్షయజ్ఞంలో అవమానం పాలైన పార్వతి ఆత్మాహుతి చేసుకోవడంతో అక్కడున్నవారంతా ముక్తకంఠంతో పార్వతీదేవిని ‘బతుకమ్మా, బతుకమ్మా’ అంటూ ఆక్రందించారనీ, వారిని కరుణిస్తూ సాక్షాత్కరించిందనీ, ఆనాటి నుంచి ‘బతుకమ్మ’గా పండుగ చేస్తున్నారనీ ఒక కథ ఉంది.

‘బతుకు’ను ప్రసాదించే తల్లి
మరొక కథ - చోళదేశాన్ని ధర్మాంగుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య సత్యవతి నూరునోములు నోచి నూరుగురు బిడ్డలను కన్నది. కానీ వాళ్లు శత్రువుల చేతిలో హతమయ్యారు. అది చూసి ఆ దంపతులు రాజ్యం విడిచి అరణ్యాలకు పోయారు. రాజు అక్కడ గొప్ప తపస్సు చేశాడు. లక్ష్మీదేవి సాక్షాత్కరించి వరం కోరుకోమన్నది. ఆ రాజ దంపతులు లక్ష్మినే తమ పుత్రికగా జన్మించమని కోరుకున్నారు.
ఆ వరం కారణంగా సత్యవతి లక్ష్మి గర్భంలో ప్రవేశించి బాలికగా జన్మించింది. అది తెలుసుకున్న వశిష్టాది మహార్షులందరూ వచ్చి ఆ బాలికను ‘బతుకమ్మా’ అంటూ ఆశీర్వదించారు. ప్రజలకు ‘బతుకును ప్రసాదించే తల్లి’ అంటూ అక్కడివారంతా ప్రేమతో పిలుచుకున్నారు.

ఆ పేరే శాశ్వతమైంది. అనంతర కాలంలో శ్రీహరి.. ‘చక్రాంగుడు’ అనే రాజకుమారుడుగా వచ్చి బతుకమ్మను వివాహం చేసుకోవడం, చక్రాంగుడు యుద్ధంలో శత్రురాజులను ఓడించి మామగారైన ధర్మాంగునికి రాజ్యాన్ని కట్టబెటడం, అంతా సుఖంగా జీవించడం.. ఇది ప్రాచుర్యంలో ఉన్న కథ. నాటి నుంచి జానపదులు లక్ష్మీదేవినే బతుకమ్మగా భావిస్తూ శ్రద్ధా, భక్తులతో పూజించడం జరుగుతున్నది. కాకతీయుల కాలం నుంచి ‘బతుకమ్మ సంబరాలు’ సామ్రాజ్యమంతా ఘనంగా జరిగేవని తెలున్తోంది. ఈ వేడుక మరింతగా విస్తృతి పొందింది. ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మ సంబురాలను రాష్ట్రపండుగగా నిర్వహిస్తుండడం విశేషం.

రోజుకో పేరు - తీరు!
బతుకమ్మ సంబురాలు భాద్రపద బహళ అమావాస్య నాడు ప్రారంభమై ఆశ్వయుజ శుక్ల నవమి వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి.

తొలి రోజు పితృ అమావాస్య. ఆ రోజున చేసే బతుకమ్మ పేర్పును ‘ఎంగిలి పువ్వుల బతుకమ్మ’గా పిలుస్తారు. ఆ రోజు పితృకార్యాలు నిర్వహించాక, స్త్రీలందరూ భుజించాక బతుకమ్మ పేర్పు జరుగుతుంది. కనుక ‘ఎంగిలి బతుకమ్మ’నే పేరు వచ్చింది.
మరుసటి రోజు పాడ్యమి నుంచి మహిళలందరూ శుచిస్నాతలై విధి విధానంగా రోజంతా ఉపవసిస్తూ బతుకమ్మను రూపొందిస్తారు. పసుపుతో గౌరమ్మను చేస్తారు. తంగేడు పూలతో అలంకరిస్తారు. తంగేడు పూలు పసుపుదనానికి ప్రతీక. పసుపు ఐదవతనానికి సంకేతం.

ఈ గౌరమ్మను రూపొందించడంలో పరంపరానుగతంగా వస్తున్న ఆచారం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. అర్థనారీశ్వరులకు సంకేతంగా బతుకమ్మను తీర్చిదిద్దుతారు. శివపార్వతుల ప్రకృతీ పురుషులకు ప్రతీకలు. ‘గౌరమ్మ’ అనగానే గోపురంలా పసుపుముద్దను చేసి, దానిని రెండు గోపురాలుగా కనబడేటట్లు ఏర్పాటు చేసి పూలను పేరుస్తారు. దాన్ని అర్థనారీశ్వర స్వరూపంగా భావిస్తారు. కొందరు తమలపాకుల్లో, మరికొందరు చిక్కడు ఆకుల్లో పెట్టి ‘‘చిక్కుడు ఆకుల్లో ఉయ్యాలో - సద్దులు కట్టి ఉయ్యాలో’’ అంటూ పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడుతారు. బతుకమ్మను పేర్చడంలో ఎంతో కళానైపుణ్యం ఉట్టిపడుతుంది. పేర్పులో ఎన్ని రకాల రంగుల పువ్వులు ఉన్నా, తంగేడు పూలదే ప్రాధాన్యం. ప్రతి వరుసలో తంగేడు పూవులు విధిగా ఉంటాయి. తంగేడు పూలు ముత్తైదువతనం ఇవ్వడమే కాదు ఐశ్వర్యాన్ని, ప్రసాదిస్తుందన్న విశ్వాసం ఉంది. అందుకే అమ్మ గౌరమ్మను ‘‘ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ - చిత్రమై తోచునమ్మా గౌరమ్మా’’ అంటూ నర్తిస్తూ ఆరాధిస్తారు. బతుకమ్మను తయారు చేసి, సాయ్రంత్రం వేళ అన్ని ఇళ్ల నుంచి స్త్రీలందరూ ఒక విశాలమైన, ప్రశాంతమైన స్థలానికి మంచి దుస్తులు ధరించి బతుకమ్మలతో తరలివస్తారు.

అలా తెచ్చిన బతుకమ్మలలో పెద్దదానిని మధ్యన పీటపై ఉంచి చుట్టూ మిగతా వాటిని అమర్చి ఆ చుట్టూ పిల్లలు, యువకులు, పెద్దలు వలయాకారం గా నుంచొని బాగా పాడగలిగిన ముత్తైదువ పాటను అందుకుంటే మిగిలినవారు బతుకమ్మపై పూలు జల్లుతూ బృందగానం చేస్తూ చుట్టూ తిరుగుతారు.

‘‘ఒక్కొక్క పూవేసి సందమామా - శివుడింకారాడాయే సందమామా - శివుడి పూజకు వేళాయె సందమామా - రెండేసి పూలేసి సందామామా - రెండు జాములాయే సందమామా’’ ‘‘శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో - చిత్తములో తలుచునమ్మ ఉయ్యాలో - కైలాసగిరివాస ఉయ్యాలో/ శంకరీ పార్వతీ ఉయ్యాలో - శంభూనీ రాణి ఉయ్యాలో/ తల్లి నిన్నెప్పుడూ ఉయ్యాలో - ధ్యానింతుమమ్మ ఉయ్యాలో’’ అంటూ పాటలు కొనసాగుతాయి. కొందరు ఉయ్యాల పాట పాడుతారు. ఈ క్రమంలో పెద్ద - చిన్న కులాల వర్గ భేదాలుండవు.

జానపద సౌరభాలు
బతుకమ్మ పాటలు లయప్రధానం. పాటల్లోని పదాలు జానపదుల సాహిత్యానికి మణిపూసలు. తెలంగాణ సాహిత్యానికి కలికితురాయిలు. మహిళలు పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. అవి వీనులకు, కనులకు విందు చేస్తాయి. ఆ సాయం సంధ్యలు అనుభూతులకే పరిమితం. వర్ణనాతీతం. ఇలా ఎనిమిది రోజులు కొనసాగాక, తొమ్మిదో రోజున ఆటలు, పాటలు పూర్తయ్యాక సత్తుపిండితో చేసిన పదార్థాలను బతుకమ్మకు
నివేదన చేస్తారు ఆపైన బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు పుట్టినింట అన్ని భోగాలను సమర్పించి, నిమజ్జనం నాడు గౌరిని మెట్టినింటికి సారె చీరలతో సాగనంపడమే ఈ నాటి కార్యక్రమంలోని ప్రత్యేకత. ఆ సందర్భంలో-

‘‘హిమవంతునింట్లో పుట్టి - హిమవంతునింట్లో పెరిగి
విదియాక్షా తదియనాడూ - కాంతలందరుగూడ’’ అంటూ పాటలు పాడతారు.

మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మా- మళ్లీ నాటికి తోలుకొత్తుమాయమ్మా- అంటూ నిమజ్జనం చేస్తారు. ఇక్కడ గౌరికీ, లక్ష్మికీ భేదం లేదు. ఇరువురూ పరాశక్తికి అభివ్యక్తీకరణలు. బతుకమ్మ నీటిపై తేలియాడుతూ చంద్రుని వెన్నెల్లో, ఎంతో మనోహరంగా ఉంటుంది.బతుకమ్మకు నివేదించిన ప్రసాదాన్ని అందరూ ఆరగించి, తాము తెచ్చుకున్న పదార్థాలను, ఫలహారాలను ఒకరికొకరు పంచుకుంటూ ఆరగిస్తూ మురిసిపోతారు. బతుకమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధించినవారికి కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం.



గౌరమ్మను రూపొందించడంలో పరంపరానుగతంగా వస్తున్న ఆచారం కొట్టవచ్చినట్టు
కనిపిస్తుంది. అర్థనారీశ్వరులకు సంకేతంగా బతుకమ్మను తీర్చిదిద్దుతారు. శివపార్వతుల ప్రకృతీ పురుషులకు ప్రతీకలు. -ఎ. సీతారామారావు

----------------------

పుష్పవల్లి - బతుకమ్మ తల్లి 


శ్రావణం గడచి భాద్రపదం, ఆశ్వయుజం రాగానే పంటచేలు పచ్చగా ఎదిగి, మొగ్గలు వన్నె వెన్నెల పూలుగా వికసించి, చిరుజల్లులతో పృథ్వి పూలజడలల్లుకొన్న పల్లెపడుచులా భాసిస్తుంది. ఈ సొగసైన సమయంలోనే ప్రకృతిని ఆడపడుచుగా భావించి ప్రణమిల్లుతూ పూలతో అలంకరిస్తూ తొమ్మిది రోజుల పండగ చేసుకోవడం ఆచారంగా వస్తోంది. ప్రకృతిని ఆరాధించే ఈ సంప్రదాయమే బతుకమ్మ పండుగ.

మార్కండేయ పురాణం దుర్గా సప్తశతిలోని ఒక కథ బతుకమ్మ పండుగ గురించిన వివరాలు తెలుపుతుంది. మహిషాసురుణ్ని సంహరించి బాగా అలసిపోయిన గౌరీదేవి ఆశ్వయుజ పాడ్యమి రోజు గాఢ నిద్రలోకి వెళ్లి, దశమి రోజు మేల్కొంటుంది. మహిషాసురుడి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరూ గౌరీదేవి దయవల్ల ఆమె నిద్ర లేవగానే బతుకుతారు. అలా ఎందరినో బతికించిన అమ్మవారిని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు అలంకరించి పండుగ జరుపుకొంటారు. ఈ తొమ్మిదిరోజులు బతుకమ్మ పేరుతో పూలతో గౌరీ దేవిని పూజించడం సంప్రదాయంగా వస్తోంది.

రంగురంగుల ఈ పూల పండుగ మహాలయ అమావాస్యరోజు ప్రారంభమవుతుంది. ఈ అమావాస్యను పెద్దల (పెత్తర) అమావాస్య అనీ పిలుస్తారు. పితృదేవతలకు ఆ రోజు తర్పణ నైవేద్యాలు సమర్పిస్తారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. తొలిరోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈ మాటకు చక్కని భావార్థం ఉంది. అంతకు ముందు ఈ పూలపై తుమ్మెదలు, ఇతర పురుగులు వాలి తేనెకోసం ఎంగిలి చేసి ఉంటాయి. అలా ఎంగిలిపడ్డ పూలతో అలంకరించిన తొలి బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు బతుకమ్మకు చప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి నివేదన చేస్తారు. ఆ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు. ఇలా వరసగా... ముద్దపప్పు బతుకమ్మ, నానేసిన బియ్యం బతుకమ్మ, అట్ల (దోసెల నైవేద్యం) బతుకమ్మలను అలంకరిస్తారు. ఆరో రోజు బతుకమ్మ అలుగుతుందని ఆడపడుచుల నమ్మకం. ఆరోజు బతుకమ్మ అలకబూని నిరాహారంగా ఉంటుంది. అందుకే ఆరో రోజు అలిగిన బతుకమ్మ! 
తరవాత వేపకాయ బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు చూడముచ్చటైన సద్దుల బతుకమ్మ. అదేరోజు దుర్గాష్టమిని జరుపుకొంటారు. ఆ రోజు అయిదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం, మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, గోధుమలు, బియ్యం, బెల్లం, పాలు... ఇందులో ఉంటాయి. ఎనిమిది రోజులు తమ ఇంట నడయాడి తొమ్మిదో రోజు జలగర్భంలోకి వెళ్తున్న బతుకమ్మ (గౌరీ దేవి)కి ఈ పదార్థాలన్నీ సద్దులుగా కడతారు. ఇదో మనోరంజకమైన విలక్షణ సంప్రదాయం.

పెళ్లయిన ఆడపడుచులు ఈ తొమ్మిది రోజుల్లో అత్తవారింటి నుంచి కన్నవారింటికి ఈ పూల పండుగ చేసుకునేందుకే వస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి మొదలైన పూలను పేర్చడం ఒక అద్భుత కళ. ఇత్తడి స్తాంబాలం(పెద్ద పళ్లెం)లో కోణాకారంగా వివిధ రంగుల పూలు, వివిధ జాతుల విరులు అమర్చడంలో స్త్రీలు పోటీ పడతారు. ఇంటి ముంగిట అలంకరించిన బతుకమ్మ చుట్టూ ఆడపడుచులు చప్పట్లు కొడుతూ తిరుగుతూ పాడే పాటలు మానసాలను స్పృశిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృజిస్తాయి.

సద్దుల బతుకమ్మ నాడు చీకటి పడుతోందనగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువుకు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరతారు. చెరువు గట్టుకు చేరుకొన్న తరవాత బతుకమ్మలను నీటిలోకి జారవిడుస్తారు. చక్కెర, జొన్న రొట్టెతో చేసిన (మలీద) ముద్దను బంధు మిత్రులకు పంచిపెడతారు.- అప్పరుసు రమాకాంతరావు

--------------------------

బతుకు ఎలా ఉండాలో నేర్పే బతుకమ్మ



     మనకు శిల, దారు, లోహాలతో విగ్రహం తయారుచేసి పూజించే సంప్రదాయం ఉంది. కానీ.. పుష్పాలను ఆరాధ్యదేవతగా చేసుకుని పూజించే సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉంది. సుందరంగా ఉండే ఈ నిసర్గచక్రంలో ముగ్ధమనోహరంగా కనిపించేవి పుష్పాలు. ఆ పువ్వులు ప్రకృతికే అలంకారమయ్యే రుతువు శరత్కాలం. వర్ణ సంశోభితమైన పుష్పాలను కళాత్మకంగా ఏర్చికూర్చే ఈ సంబరం చూసిన కన్నులే కన్నులు. బతుకమ్మలను తీర్చిదిద్దడం, ఆ తర్వాత వాటిచుట్టూ స్త్రీలు తమ సంగీత, నృత్య, సాహిత్య కౌశలాన్ని ప్రదర్శించేందుకకు ఆడే ఆటలు, పాటలు మరో వినూత్న చైతన్యాన్ని తెలియజేస్తాయి. చివరిరోజు సద్దుల బతుకమ్మనాడు కలిసి ప్రసాదాలు పంచుకుని ఆడిపాడి ఆనందాన్ని పంచుకొనే దృశ్యం మన పండుగల సామాజిక దృష్టిని తెలియజేస్తున్నది. అదేరోజు సాయం సమయాన నీటిలో తేలియాడుతూ పూలరథాలుగా పయనించే వర్ణశోభిత బతుమ్మల సౌందర్యంలో భాషకందని భావాలతో సాగనంపే స్త్రీమూర్తుల ఆరాధన వ్యక్తమవుతుంది.

ఈ బతుకమ్మ.. వర్షరుతువు సమాప్తిని, శరదృతువు ఆగమనాన్ని సూచిస్తూ ఏటా మహాలయ అమావాస్య నుండి ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ మహర్నవమి మహాగౌరీపూజతో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల్లో తయారుచేసే బతుకమ్మలను ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పేర్లముందున్న పదార్థాలే నైవేద్యాలు. బతుకమ్మ శబ్దం ‘బృహతమ్మ’ నుంచి వచ్చిందని కొందరు చెబుతారు. కాకతీయుల వంశదేవత కాకతమ్మనే బతుకమ్మగా మారిందని మరికొందరు పరిశోధకులు చెబుతున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో తంగేడు పువ్వుగా పుట్టిన చెల్లెలే బతుకమ్మ అని జానపదగాథలు చెబుతున్నాయి.

సంప్రదాయాలు తెలిసినవారు నవరాత్రుల్లో శ్రీచక్రాన్ని ముందు పెట్టుకొని నవావరణ పూజ చేస్తే.. సామాన్య స్త్రీలు ఎలాంటి రసాయనాలూ లేకుండా పూచే తంగేడు, గుమ్మడి, బీర, కట్ల గోరింట, గునుగు, అల్లి, టేకు పూలతో బతుకమ్మను మేరుప్రస్థ శ్రీచక్రం ఆకారంలో అమర్చి ఆరాధిస్తారు. స్త్రీలు ఇంటిపనులకే పరిమితం కాకుండా ఆట, పాటలలో నిమగ్నమై సామూహిక నిమజ్జనం (సామాజిక దృష్టి) చేసి సరికొత్త ఆలోచనలకు తెరతీస్తారు. అందరూ కలిసి ఆడిపాడి కులసమానత్వాన్ని సాధిస్తారు. సద్దుల బతుకమ్మనాడు అందరూ ఇళ్లనుంచి తెచ్చుకున్న ప్రసాదాలు పంచుకుని తినడం అంటే.. రుచికరమైన పదార్థం అందరూ తినాలనే ఆత్మీయత అందులో ఉంటుంది. మాతృ ఆరాధనకు నెలవుగా ఉన్న ఈ పండుగ స్త్రీత్వాన్ని గౌరవించాలని తెలుపుతుంది. అమ్మదనం ఉండి అందరూ బతకాలి.. అందరినీ బతికించాలి అనే సందేశం ఈ పండుగలో నిగూఢమై ఉంది. -డా.పి.భాస్కరయోగి


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment