పురాణపండ ఆదిత్య హృదయం | Puranapanda Aditya Hrudayam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

పురాణపండ 
ఆదిత్య హృదయం 
 Puranapanda 
Aditya Hrudayam 
Rs 12/-

నాయనా రామచంద్రా శత్రుసంహారము చేసి విజయము సాధించుటకై నీకు ఒక పరమ రహస్యమైన స్తోత్రమును తెలిపెదను.అక్షయమైన ఫలమునిచ్చు మంగళప్రదమైన స్తోత్రమిది ! దీనిని ఆదిత్యహృదయము అందురు.ఈ స్తోత్రము ఏ చింతలను చెంతకు రానీయదు ఏ కోశానా మనిషి శోకమునకు లోనుకాడు. ఆయుష్షును వృద్ధిపొందించును.
.
లోకులను తమతమ జీవనవ్యాపారములలో ప్రవర్తింపచేయువాడు సాక్షాత్తూ ఆదిత్యుడే! దేవ అసురుల చేత నమస్కరింపబడు ఆదిత్యుడే ఆరాధ్యుడు.
.
ఆయన సర్వ దేవతాస్వరూపుడు ,సకలలోకులను రక్షించువాడు...
ఆయనే బ్రహ్మ
ఆయనే విష్ణువు
ఆయనే స్కందుడు
ఆయనే శివుడు
ఆయనే ప్రజాపతి
ఆయనే కుబేరుడు
ఆయనే కాలుడు
ఆయనే యముడు
ఆయనే సోముడు
ఆయనే వరుణుడు.
.
ప్రతిజీవునిలోనూ ఆత్మగా ఉండి తానే జన్మింపచేయుచున్నాడు ....అందుకే ఆయన ...ప్రజాకర్తా
.
ఋతువు అనగా జ్ఞానము  మనకు కలిగిన జ్ఞానములన్నింటికీ కారణము సూర్యుడే ! కావున ఆయన "ఋతుకర్తా"
.
ప్రభాకరః --- ప్రభ అనగా వెలుగు ఆవెలుగును కలిగించువాడు సూర్యుడు (ఆదిత్యుడు )....అని ఆదిత్యుని గురించి పూర్వపీఠిక చెప్పి ఆదిత్యహృదయమును అగస్త్య మహర్షి శ్రీరామునకు ఉపదేశించుట ప్రారంభించినాడు.
-జానకిరామారావు వూటుకూరు

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment