సత్యనారాయణవ్రతం | Satyanarayana Vratham

శ్రీ సత్యనారాయణవ్రతం 
 Satyanarayana Vratam 

 Rs 25/-
--------------------------------

సత్యనారాయణ వ్రతము,
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ విధానము. ఈ వ్రతమును హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును.
వ్రత సామాగ్రి
పసుపు
కుంకుమ
తమలపాకులు
పోకచెక్కలు
అరటిపళ్ళు
నారికేళములు కొబ్బరికాయలు
మంటప అలంకరణకు తువ్వాళ్ళు
మామిడి ఆకులు
దీపసామాగ్రి
పూజా సామాగ్రి
బియ్యము
కలశము
పంచామృతాలు
సత్యనారాయణ స్వామి ప్రసాదము
చిల్లర నాణెములు

మొదటి వ్రత కథ
ఒకానొక సమయమున నైమిశారణ్యమునకు విచ్చేసిన సూత మహర్షిని శౌనకాది మునులు ఇటుల అడిగినారు "మహానుభావా.. దేని చేత మనుషులు తమ కోరికలననుభవించి, మోక్షమును పొందగలరు?" అందులకు సూత మహర్షి


శ్రీ సత్యనారయాణవ్రతమే సకల ధు:ఖ నివారిణి,ఈ వ్రతమును ఏ రోజునైనను చేసి, వ్రతానంతరము తీర్ధప్రసాదాలు పుచ్చుకొనవలెను. ఈ వ్రతము చేసిన వారు మోక్షమును పొందెదరని మహావిష్ణువు నారదునకు తెలిపెను.

కనుక జనులారా, సత్యనారాయణ వ్రతము చేసినచో మీ కోరికలు తీరునని సూత మహర్షి తెలిపెను. ఇది మొదటి వ్రత కథ.
రెండవ వ్రత కథ
కాశీ పట్టణమందు ఒక బీద బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునికి ఒక రోజు ఏమీ భిక్ష లభింపక విచారముతోనుండగా, సత్యనారాయణస్వామి ఒక ముదుసలి బ్రాహ్మణవేషములో వచ్చి నాయనా నీ బాధ ఏమి అడిగాడు. అంతట ఆ ముసలి బ్రాహ్మణుడు, సత్యనారాయణవ్రత విశేషము తెలిపి అదృశ్యుడాయెను. అంతట బీద బ్రాహ్మణుడు రేపే ఈ వ్రతము చేసెదనని నిశ్చయించుకున్నవాడై మరుసటి దినము నిత్యకృత్యములు నెరవేర్చి "స్వామీ! ఈ రోజు లభించిన బిక్షతో నీ వ్రతము చేసెదను" అని పలికి భిక్షాటనకు బయలుదేరెను. ఆనాటి వేళావిషయమున అతనికి విశేషమైన భిక్ష లభించెను. పిమ్మట లభించిన భిక్షతో ఆ బ్రాహ్మణుడు వ్రతము చేసెను. వ్రతమహిమ వలన సమస్తసంపదలు కలిగినవి. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ప్రతీ మాసము సత్యనారాయణస్వామి వ్రతము చేసెను. ఆ బ్రాహ్మణుడు ఒకానొక ఏకాదశినాడు వ్రతము చేయుచుండగా కట్టెలమ్ముకొనువాడు వచ్చి వ్రతమంతయూ చూచి వ్రత మహిమ తెలుసుకొన్న వాడై, తను కూడా తరువతి దినమునాడు వ్రతము చేసెదనని పలికెను. తరువాతిదినమున, కట్టెలమ్మగా మిక్కిలి విశేషముగా ధనము లభించింది.ఆ ధనముతో ఆ నాడు వ్రతము చేసినవాడై అనతికాలమునందు ధనవంతుడయ్యెను. సత్యనారాయాణ వ్రత విశేషము వల్ల బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్ముకొనువాడు కోరికలు తీరి మోక్షమునొందినారు. ఇది రెండవ వ్రత కథ MORE.............


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment