లాల్ కితాబ్ | Laal Kithab Keywords for Lal Kitab: Lal Kitab, GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu Lal Kithab, Pucha Srinivasa Rao, Sri Pucha Srinivasa Rao, Mohan Publications, Astrology, Jyotishyam, Jotishyam, Jotisham, Jyothisham, Jyothisham,

లాల్ కితాబ్ 
Lal Kitab
Author: Pucha Srinivasa Rao
Rs 108/-


లాల్‌కితాబ్‌ విశేషంగా నివారణలు తెలియచేసే గ్రంథంగా పేరుపడింది. ఇది ఉత్తర భారతదేశంలో విశేష ప్రాచుర్యంలో ఉంది. లాల్‌కితాబ్‌లో తెలియచేసిన రెమిడీలు చాలావరకు నైతిక ప్రవర్తనను పెంపొందించేవిగా ఉండం గమనార్హం.ఉదాహరణకు 1.అబద్ధము ఆడరాదు.2.పెద్దలపై గౌరవం చూపాలి.3.ఇంట్లోని పెద్దవారి ఆశీస్సులు తీసుకోవాలి.3.స్త్రీలను గౌరవించడం,అసహాయులైన వారిని ఆదరించడం 4.మనతో జీవించే మూగజీవాలకు ఆహారం తినిపించడం 5.తామస గుణాన్ని పెంచే మద్యాదులను ముట్టుకోవద్దని చెపుతుంది. ఇవే సగం రెమిడీలు.

మన ప్రమేయం లేకుండ జరిగే తప్పులకు,తప్పని పరిస్థితులలో చేసే పనులకు, పూర్వజన్మార్జిత పాపఫలితాల నివారణకు ఇందు నివారణలు చెప్పబడ్డాయి. తెలిసి తప్పులు చేస్తూ వాటినుండి బయట పడడానికి నివారణలు ఉండవనే చెప్పాలి. ఇవి వర్తమానంలో భాదపెట్టకపోయినా కొంతకాలానికి,లేదా తరువాత జన్మలోను, లేదా వీరి వారసులపై ఎవ్వరిపైనైనా వీటి ప్రభావం చూపించవచ్చును. అందుకే ఎవ్వరు చేసిన ఖర్మ వారనుభవించవలసిందే అనే నానుడి ఏర్పడింది.

ఈనాడు రెమిడీల పేరుతో అనేక పుస్తకాలు వెలువడుతున్నాయి.వీటిలో లాల్‌కితాబ్‌ అనుసరించి రెమిడీలు తెలియచేయడం కంటే సులువైనవైన రత్నములు,రుద్రాక్షలు వీటిని గురించి మాత్రమే చర్చిండం జరుగుతోంది. మందుల షాపులో అనేక మందులు ఉండవచ్చును. అయితే రోగనిర్ధారణ చేయకుండా ఆ మందు దేనికి పనిచేస్తుందనే విషయం తెలుసుకోకుండ మందును వాడితే అది ఏ విధంగా పనిచేయదో అదేవిధంగా కారణం తెలుసుకోకుండ చేసే రెమిడీలు నీటి మీద రాతల్లా వ్యర్ధం అవుతాయి. లాల్‌కితాబ్‌ను అనుసరించి జాతక విచారణ చేసి దానికి తగిన రెమిడీలు చేస్తే చక్కని ఫలితాలు కలుగుతాయి.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment