Keywords for Brahmanula Indlaperlu Gotralu Pravaralu: BrahmanulaIndlaperluGotraluPravaralu, Brahmanula Indlaperlu Gotralu Pravaralu, Brahmanula Indlaperlu, Brahmanula Gotralu, Brahmanula Pravaralu, Brahmanula, Surnames of Brahmins, Gotras of Brahmins, Pravaras of Brahmins, Mohan Publications, MohanPublications
బ్రాహ్మణుల గోత్రాలు-ప్రవరలు 
Brahmanula Gotraalu - Pravarulu
Rs 108/-

     బ్రాహ్మణులలో అనేక శాఖలు వున్నాయి అంటే తెగలు అని చెప్పుకోవచ్చును. వెలనాడు నుంచి వచ్చినవారు వెలనాట్లు, పలనాడు నుండి వచ్చిన వారు పలనాట్లు, వేంగిదేశమునుండి వచ్చినవారు వేగినాట్లు, కోసలదేశము నుండి వచ్చినవారు కాసలనాట్లు, నదీపరివాహక ప్రాంతముల నుంచి వచ్చినవారు మురికినాట్లు, ద్రవిడ దేశమునుండి వచ్చినవారు ద్రావిడులు, ద్రవిడులు వస్తూ వస్తూ ఒక అడవిలో విశ్రాంతి తీసుకున్నవారు కొందరు వారిని ఆరామద్రావిడులుగాను, రాజ్యాలలో ఉద్యోగమునకు నియమించబడిన వారు నియోగులు, ఆ నియోగులులలో ఆరువేలమందికి ఒకేసారి ఉద్యోగములో నియమించబడడంచేత వారు ఆరువేల నియోగులుగాను చరిత్ర చెపుతూవున్నది.

      ముఖ్యముగా మన ఆంధ్రప్రదేశ్‌లోవున్న ఆంధ్రులకు ఊరుపేరు ఇంటి పేరుగా వస్తుంది. మనం ఏ ఋషులయొక్క పరంపరవారమో వారి యొక్క పేరు గోత్రమవుతుంది. ఏ ఋషియొక్క ధర్మసూత్రములను పాటిస్తామో ఆ సూత్రము మన ప్రవరలో చెప్పబడుతుంది. ప్రవర అంటే శ్రేష్ఠుడు అని అర్థము. ఋషి అనగా మంత్రద్రష్ట నాల్గువేదములలో మన పూర్వీకులు ఏ వేదాధ్యయనము చేసివున్నారు. ఋగ్వేదము, యజుర్వేదము, యజుర్వేదములో కృష్ణ, శుక్ల యజుర్వేదములున్నాయి. సామవేదము, అధర్వణ వేదము ఆ వేదము యొక్క శాఖను మనము ప్రవరలో చెపుతాము. అంటే కలియుగంలో ప్రధమపాదంలో ఈవైనస్వత మన్వంతరములో వున్న మన యొక్క పూర్వకాలమునాటి ఉనికిని చెపుతున్నామనమాట. అన్ని తెగలు (శాఖలలోను) లోను ఒకే ఊరుపేరు ఇంటిపేరుగా రావచ్చు. అంటే వారు అందరూ ఆ వూర్లనుంచి వలస వచ్చినవారు, ఆ వూర్లకు ఏ ప్రాంతము నుండి వలస వచ్చినారో అంటే వెలనాడు, పలనాడు కోసలదేశము లేక ద్రవిడదేశము అని ఆ ప్రాంతమును గూడ చెప్పుకోవడం జరుగుతుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment