Tula Lagnam: Tula Lagnam, Tula Rasi, Thula, Raasulu, Zoidac Signs, Libra, Pucha Srinivasa Rao, Mohan Publications, Jyotishyam, Vastu, Lagnalu, Lagnaalu, Zodiac Signsతుల లగ్నం Tula Lagnam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

తుల లగ్నం
Tula Lagnam
Author: Pucha Srinivasa Rao
Pages: 162 -- Rs 99/-


    ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును. రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.

రాశీ చక్రంలో ఏడవరాశిగా చెప్పుకొనేది తులారాశి. కన్యారాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 180 – 210 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. చిత్ర 3 4, స్వాతి 4, విశాఖ 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం అక్టోబర్ 18 – నవంబర్ 16 మధ్యలో పుట్టిన వారిని తులారాశి జాతకులుగా చెప్పబడ్డారు.

మీరు తులా లగ్నం, తులారాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1. మేధావులుగా కలిగినవారైతే, 
2. సమస్యకు పరిష్కారం కనుగొనేవారైతే
3. నేర్పు కలిగినవారైతే 
4. ఆకర్షమైన రూపం కలిగినవారైతే
5. రొమాంటిక్ అయితే 
6. అందరితో సరదాగా కలిసేవారైతే 
7. అనేకమంది మిత్రులు కలిగినవారైతే 
8. కష్టించే నైజం కలిగినవారైతే 
9. అనేక విషయాల్లో నేర్పు కలిగినవారైతే 
10. ఆడంబరమంటే ఇష్టం కలిగినవారైతే 
మీరు తప్పకుండా తులారాశివారే ... ఇక పుస్తకం చదవండి....



















ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment