శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్
8143123549#మేషం మిశ్రమ ఫలితాలున్నాయి. శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు. కీలక విషయాల్లో బద్ధకించకూడదు. కొందరి ప్రవర్తన మీకు కాస్త మనస్తాపం కలుగుతుంది. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదివితే మంచిది.
చక్కటి ప్రణాళికా విధానంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. సంపూర్ణ అవగాహనతో పనిచేయాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. అప్పులు పెరగకుండా చూసుకోవాలి. ఊహించని ఇబ్బందులు వస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు కుటుంబసభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలైన ఫలితాలను ఇస్తాయి. పట్టుదలతో ఆపదలు దూరమవుతాయి. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు. ఆదిత్య హృదయ పారాయణ మంచినిస్తుంది.


#వృషభం మధ్యమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. అనవసర ఆందోళనలు తగ్గించుకుంటే మంచిది. లలితా సహస్రనామాలు పఠించాలి.
కార్యసిద్ధి ఉన్నది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. గొప్ప ఆర్థిక లాభాలున్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. ఎక్కువ సమయం అభివృద్ధికి ఉపయోగిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ఆరోగ్యం శుభప్రదం. ఇష్టదైవ సందర్శనం మరింత మేలు చేస్తుంది.

#మిథునం తలపెట్టిన కార్యాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. పెద్దల ఆశీర్వచనంతో చేసే పనులు ఫలిస్తాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. దుర్గ అష్టోత్తరం పఠించాలి.
చక్కటి ఆలోచనా విధానంతో సత్ఫలితాలను సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుని గొప్ప ఫలితాలను పొందుతారు. అవసరమైన వాటిపై దృష్టిసారించండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకండి. అందరినీ కలుపుకొనిపోతే విజయాన్ని తొందరగా అందుకుంటారు. మంచి భవిష్యత్తుకి మీరుచేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతంలో శుభ ఫలితాలున్నాయి. లక్ష్మీ నారాయణ సందర్శనం శుభప్రదం.

#కర్కాటకం శుభకాలం. ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. శివ నామస్మరణ మంచిది.
గొప్ప శుభకాలం. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు. ముందుచూపుతో వ్యవహరించాలి. ఎన్ని సమస్యలున్నా మీ బుద్ధిబలంతో పరిష్కరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. దీర్ఘకాల ప్రణాళికలు ఫలిస్తాయి. విజయాన్ని అందుకునే దిశగా మీ ఆలోచనలుంటాయి. సమస్యలు సద్దుమణుగుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవారాధన శుభప్రదం.#సింహం మిశ్రమ కాలం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్య కార్యాలు చేసేముందు పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శివుణ్ణి ఆరాధించాలి.
బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే వరిస్తుంది. శ్రమ పెరుగుతుంది. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులను కలిసి కీలక విషయాలు చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. మనోబలంతో ముందుకుసాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే సమస్యలు తొలగుతాయి.


#కన్య మిశ్రమ వాతావరణం ఉంటుంది. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
సంకల్పాలు నెరవేరుతాయి. చిత్తశుద్ధితో చేసే కార్యాలు వెంటనే సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలున్నాయి. ఆర్థిక విషయాల్లో మోసపోకుండా జాగ్రత్త పడాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీలోని మంచితనం మిమ్మల్ని రక్షిస్తుంది. ఈశ్వర సందర్శనం శుభప్రదం.


#తుల‌ శుభకాలం. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగితే అనుకూలత లభిస్తుంది. కీలక పనులను ఈరోజు ప్రారంభించడం మంచిది. ఇష్టదైవం నామస్మరణ ఉత్తమం.
గట్టి సంకల్పబలంతో అనుకున్నది సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతలు పెరుగుతాయి. నూతన వస్తువులు కొంటారు. తోటివారికి సహాయపడతారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన వల్ల మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు.


#వృశ్చికం శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. దుర్గాస్తుతి శుభాన్నిస్తుంది.
సరికొత్త ఆలోచనలతో మంచికార్యాలను ప్రారంభిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి మీకు అడ్డురావు. వ్యాపారంలో లాభాలున్నాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలుంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. వారాంతంలో శుభవార్తను వింటారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. దుర్గా స్తోత్రం చదివితే మంచిది.

#ధనుస్సు అనుకూలమైన ఫలితాలున్నాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రం పఠిస్తే మంచిది.
ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభముంది. లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా తగు జాగ్రత్తలు అవసరం. కీలక విషయాల్లో సమయానుకూలంగా ముందుకు సాగితే మేలు జరుగుతుంది. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన కాస్త బాధ కలిగిస్తుంది. ఈశ్వర సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.


#మకరం దైవబలం రక్షిస్తోంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శత్రువులు తగ్గుతారు. మంత్రసిద్ధి ఉంది. ఈశ్వరుణ్ణి పూజించడం వల్ల మంచి జరుగుతుంది.
దైవబలం కాపాడుతోంది. అదృష్టం సిద్ధిస్తుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగండి. మనస్సు చెడును ఊహిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. ఆగ్రహావేశాలకు ఆమడదూరంలో ఉండండి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి చేయడం ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్త. శివారాధన మేలుచేస్తుంది.

#కుంభం ఆత్మశక్తితో చేసే పనులు అనుకూలిస్తాయి. దైవారాధన వల్ల ముఖ్య వ్యవహారంలో ముందు జాగ్రత్త పడాలి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల మంచి జరుగుతుంది. దుర్గాదేవిని ఆరాధించాలి.
వారం శుభప్రదంగా మొదలవుతుంది. మీ మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర విషయాలను అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. దుర్గాదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.


#మీనం ఊహించినదానికంటే గొప్ప ఫలితాలను పొందుతారు. సమయం చాలా విలువైనదిగా గుర్తిస్తారు. రక్తసంబంధీకులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఒక వార్త శక్తినిస్తుంది. ఇష్టదైవ నామాన్ని పఠించాలి.
పూర్వపుణ్యం కాపాడుతోంది. అదృష్టం యోగముంది. ఆర్ధిక వ్యవహారాలు లాభిస్తాయి. అనుకున్న సమయానికి పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగంలో మంచిఫలితాలున్నాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. దైవబలం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్మీ ఆరాధన శుభప్రదం.

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu


BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu
BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu
BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu
BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu
BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu
BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment