ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచారామాలు | dwadasa jyotirlingas | pancharamas | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ద్వాదశ జ్యోతిర్లింగాలు

అష్టాద‌శ శ‌క్తి పీఠాలు

 పంచారామాలు
 Dwadasa Jyotirlingas 
Astadasa Sakthi Peetalu
Pancharamas 
Rs 63/-
కోర్కెలు తీర్చడం నుంచి మోక్షం ఇచ్చే దాకా..   ‘సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం..’ అని మనం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదువుతుంటాం. సోమనాథ్‌లో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాలేశ్వరుడు, ఓంకారేశ్వరంలో అమలేశ్వరుడు, పర్లిలో వైద్యనాథుడు, పుణెలో భీమశంకరుడు, రామేశ్వరంలో రామలింగేశ్వరుడు, ఔండా(గుజరాత్‌)లో నాగేశ్వరుడు, వారణాసిలో విశ్వనాథుడు, నాసిక్‌లో త్య్రంబకేశ్వరుడు, కేదారనాథ్‌లో కేదారేశ్వరుడు, వెరుల్‌ (మహారాష్ట్ర)లో ఘృష్ణుశ్వరుడు.. ఈ పన్నెండూ జ్యోతిర్లింగాలు. అయితే, జ్యోతిర్లింగాలని వాటిని పిలిచినప్పుడు ఆ పన్నెండు చోట్లా జ్యోతి ఉండాలి. కానీ, ఆయా క్షేత్రాల్లో శివలింగమే కనపడుతుంది కానీ జ్యోతి కనపడదు. మరి వాటిని అలా ఎందుకు పిలుస్తారు? దీనికి సమాధానం రుద్రంలోని ప్రార్థనాగద్యంలో చెప్పారు.

ఆపాతాళనభఃస్థలాన్తభువన బ్రహ్మాండ మావిస్ఫురత్‌
జ్యోతిస్ఫాటికలింగ మౌళివిలసత్పూర్ణేందు వాన్తామృతై
అస్తోకాప్లుతమేకమీశ మనిశం రుద్రానువాకాన్‌ జపన్‌
ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే చ్ఛివమ్‌

ఏ లింగం దగ్గరకు వెళ్లి మనం అడిగినప్పుడు ఇహమునందు కావాల్సిన సౌఖ్యం నుంచి మోక్షం వరకూ ఏదైనా ఇవ్వగలిగిన పరబ్రహ్మస్వరూపాలే జ్యోతిర్లింగాలు. ఈ లోకంలో జ్ఞానం పొందాలన్నా, కోరికలు తీరాలన్నా శివుణ్ని అర్చించాలి. అందుకే ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లయితే నలభై ఒక్క రోజులు దక్షారామం వెళ్లి భీమేశ్వర దర్శనం చేసుకోమంటారు. దక్షారామం భోగక్షేత్రం. అది మనిషికి ఎలాంటి భోగాలనైనా ఇచ్చేస్తుంది. ఎలాంటి కోరికనైనా తీర్చేస్తుంది. జ్యోతిర్లింగాన్ని ఒకసారి చూసి ఇంటివద్ద కూర్చుని తిరిగి దానిని స్మరించినట్లయితే కోరిక తప్పక తీరుతుంది. ఆ మేరకు వేదం అభయం ఇచ్చింది. కాబట్టి కోర్కెతీర్చడం నుంచి మోక్షం ఇవ్వడం వరకూ చేయగలిగిన శివలింగాలు ఏవి ఉన్నాయో అవే జ్యోతిర్లింగాలు. అవి ‘స్వయంభు’.. ఒకరు ప్రతిష్ఠ చేసినవి కావు. ఈశ్వరుడు చిత్రవిచిత్రమైన పరిస్థితుల్లో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం ఆయా క్షేత్రాల స్థలపురాణాలను పరిశీలించాలి. వినాలి. గుడిలో దర్శనం చేసుకునేటప్పుడు వినే స్థలపురాణాన్ని.. జ్యోతిర్లింగ ఆవిర్భావ చరిత్ర పురాణాంతర్గతంగా వింటే, ద్విగుణీకృత ఫలితం కలుగుతుంది. గుడిలోకి వెళ్లి దర్శనం చేసి ధ్యానం చేసిన ఫలితం ఎంతటిదో అంత ఫలితాన్ని ఇస్తుంది. అందుకే వీటిని పురాణాల్లోకి తీసుకువస్తారు. ఆయా కథలను తెలుసుకుని స్మరించడం చేత.. స్వయంభువు అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభ ఫలితాలను ఇస్తాడు.
- చాగంటి కోటేశ్వరరావు శర్మ

----------------------

   శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలోఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

     కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

జోగులాంబ - ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగభద్ర' & Krishna నదులు కలిసే స్థలంలో ఉంది.

భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.

మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా - వైతరిణీ నది తీరాన ఉంది.
మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.

సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.

---------------------

కంచి కామాక్షి
కోరిన కోర్కెలు తీర్చే కామాక్షి దేవి 

ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచారామాలు | dwadasa jyotirlingas | pancharamas | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. ‘క‘ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అనేది లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు.. సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితాసహస్రనామ జపం జరపడమే అనువైన మార్గం. దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదని అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉద్ధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులలో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం. దేవి సూదిమొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి.

కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చొనట్లు మలిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.


ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్రరూపంలో బలి కోరుతుండటంతో.. ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్లొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీకామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు.

కామాక్షీదేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రీ మంటపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగా వేదాలుగా, 24స్తంభాలను గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతీ బుధవారం చందనకాపు పూజ (చందనాలంకారం), రోజూ మూడు సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు.

నవరాత్రులను మూడు విభాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి మూడు రోజులు దుర్గాదేవిని, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ స‌య‌మంలో కన్య(బాలిక), సుహాసిని(వివాహిత)పూజ‌ల‌ను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రులలో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.


గోవు, గజశాల.. 
ఆలయంలోని కుడివైపున గజరాజుల కోసం ప్రత్యేకంగా ఓ షెడ్డు ఉంది.ప్రతీ రోజు ఉదయం గోపూజ, గజపూజను ఉదయం 5 గంటలకు నిర్వహిస్తారు.

దర్శన వేళలు 
ప్రతీరోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ.. తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8.30వరకు

ఎలా వెళ్లాలి.. 
కాంచీపురానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు.

బస్సు మార్గమైతే.. 
కాంచీపురానికి వెళ్లేందుకు ముందుగా కర్నూలు మీదుగా తిరుపతి చేరుకుని అక్కడ్నుంచి వెళ్లవచ్చు. తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడ్నుంచి కోయంబేడ్‌ బస్‌స్టేషన్‌ నుంచి కంచికి బస్సులో వెళ్లవచ్చు.

రైలు మార్గంలో వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా చెన్నై వెళ్లే కాచిగూడ ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌, వారంలో ఒక్కసారి ఉండే స్పెషల్‌ ట్రైన్‌ ద్వారా వెళ్లొచ్చు. అరక్కోణం స్టేషన్‌లో దిగి అక్కడ్నుంచి కంచి వెళ్లాలి. లేదా నేరుగా చెన్నై వెళ్లి అక్కడ్నుంచి లోకల్‌ ట్రైన్‌ ద్వారా చేరుకోవచ్చు. మరోమార్గం తిరుపతికి నేరుగా ట్రైన్‌లో వెళ్లి అక్కడ్నుంచి పుదుచ్చేరి వెళ్లే రైలులో కంచికి వెళ్లొచ్చు.

* చెన్నై విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా కంచి చేరుకోవచ్చు.

-----------------

ఐదవ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ


రాష్ట్రంలో చారిత్రకంగా శైవ క్షేత్రాల్లో అలంపూర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ దేవాలయం దక్షిణ కాశీగా, శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతున్నది. ఈ క్షేత్రంలో శ్రీ బాలబ్రహ్మేశ్వరుడు, జోగుళాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో అయిదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో బ్రహ్మకు తొమ్మిది ఆలయాలు ఉండడం విశేషం. ఇంతటి ప్రసిద్ధి చెందిన క్షేత్రాన్ని 
దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నంచి కూడా యాత్రికులు వస్తుంటారు. చారిత్రకంగా ఈ ఆలయాన్ని 6వ శతాబ్దానికి చెందిన బాదామి చాళుక్య వంశంలోని రెండవ పులకేశి నిర్మించినట్లు తెలుస్తున్నది. ఆ ఆలయ దర్శనం ఈ వారం.
-మధుకర్ వైద్యుల

అలంపూర్‌కు పూర్వనామం హేమలాపురం. కాలక్రమేణ ఈ నామం రూపాంతరం చెందుతూ హతంపురం,యోగలాపురం,జోగళాపురం, అలంపురంగా రూపాంతరం చెందింది.

ఎక్కడ ఉంది?: ఐదవ శక్తిపీఠంగా, శ్రీశైలం పశ్చి మ ద్వారంగా భాసిల్లుతున్న అలంపూర్ జోగులాంబ ఆలయం జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర తీరాన అలంపూర్ గ్రామంలో ఉన్నది.

ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ కర్నూలు రైలు మార్గంలో జోగులాంబ హాల్ట్ ఉంటుంది. అలంపూర్ పట్టణం మహబూబ్‌నగర్ పట్టణానికి 90 కి.మీ దూరంలో, గద్వాలకు 61 కి.మీ.ల దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 200 కి.మీ దూరంలో ఉంటుంది.

ఆలయ విశిష్టత: బ్రహ్మదేవుడు ఈశ్వరుడిని ప్రస న్నం చేసుకునేందుకు తపస్సు చేశాడని, దానిని మెచ్చిన ఈశ్వరుడు ఇక్కడ వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. బహ్మదేవుని తపస్సు ద్వారా పరవేశ్వరుడు ఉద్భవించాడని, బ్రహ్మ కారణంగా ఈశ్వరుడు ఇక్కడ వెలిసినందున ఈ స్వామిని బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తున్నారు. శైవక్షేత్రాల్లో శివలింగాలు స్థూపాకారంగా ఉంటాయి. అలంపూర్‌లో మాత్రం గోస్పాద ముద్రిక, రసాత్మ లింగంగా వెలసింది.

నవబ్రహ్మ ఆలయాలు: ఇక్కడ మొత్తం తొమ్మిది ఆలయాలు ఉన్నాయి. వీటిని నబబ్రహ్మ ఆలయాలు అని పిలుస్తుంటారు. కుమార, ఆర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మబ్రహేశ్వర అలయాలుగా వాటిని పిలుస్తారు. ఆలయాలపై పంచతంత్ర కావ్య కథాశిల్పాలు, ఆదిత్య హృదయం, రామాయణ మహాభారత గాథల శిల్పాలు దర్శన మిస్తాయి.

ఐదవ శక్తిపీఠం: విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా విభజించాడట. ఆ పద్దెనిమిది భాగాలు వేర్వేరు ప్రాంతా ల్లో పడ్డాయని, వాటిని ఆది శంకరాచార్యులు పద్దెనిమిది పీఠాలుగా గుర్తించి ప్రాణప్రతిష్ట చేశాడని చెబుతారు. ఇందులో దంత పంక్తి భాగం అలంపూర్‌లో పడ్డట్లు, దాంతో ఇక్కడ జోగులమ్మ వారు వెలసినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది.

సేమ్ టూ సేమ్: ఉత్తర భారతంలోని కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అలంపూర్‌లోని బాల బ్రహ్మేశ్వరుని దర్శించినా అంతే మహాపుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాశీలో ఉత్తర వాహిణి గంగానది అయితే అలంపూర్‌లో ఉత్తర వాహిణి తంగభద్ర నది ప్రవహిస్తుండడం విశేషం. కాశీలో 64 స్నాన ఫట్టాలు (మణికర్ణిక) ఉండగా, అలంపూర్‌లో 64 స్నానఘట్టాలున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైన కాశీ విశాలాక్షి అమ్మవారు అక్కడ వెలిస్తే అయిదవ శక్తి పీఠంగా జోగుళాంబ అమ్మవారు వెలిశారు.

ఉత్సవాలు: అలంపూర్ క్షేత్రంలో కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇక్కడ వర్ణార్చన, కన్యా పూజల కోసం మహిళలు తరలివస్తారు.


ఆధ్యాత్మిక అనుభూతిఅలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం, భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్టించారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment