Keywords for Bruhatsamhita 1: Bruhatsamhita 1, Bruhatsamhita1, Bruhatsamhita, Bruhatsamhita - 1, Bruhatsamhitha, Varahamihira Virachita, Bhattotpala Vyakyanamu, Panchangamulu, Jyotishyamu, Jyotisyamu, Astrology, Hindu, Religious, Vastu, Vastu Sastram, Vastu Sastramu, Sishtla Umamaheswara Sarma, Sistla Umamaheswara Sarma, Religious & Spiritual, Granthanidhi | MohanPublications | bhaktipustakalu

బృహత్సంహిత - 1 
Bruhatsamhita 1
Author: Dr. Sishtla Umamaheswara Sarma
Pages: 277 -- Rs 250/-


సంస్కృత శ్లోక తాత్పర్యం భట్తోత్పల వ్యాఖ్యానం తెలుగులో రావడం ఇదే మొదటిసారి. శ్రీమాన్ శిష్ట్లా ఉమామహేశ్వరశర్మ గారి ప్రయోగం అద్భుతంగా ఉంది. ఒక విధముగా చెప్పాలంటే వారు చాలా సాహసం చేశారు అని అనుకోవచ్చు. ఇప్పటివరకు తెలుగులో చాలా జ్యోతిష గ్రంథాలు అనువాదం జరిగాయి కాని బృహత్సంహిత మాత్రం జరుగలేదు. బహుశా వీరికోసమే అనుకుంటా ఈ గ్రంథం ఇంకా ఎవరూ అనువాదం చేయలేదు. శిష్ట్లా వారి రచనాశైలి చాలా సరళమైన బాషతో సంస్కృత పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారికి కూడా సులభంగా అర్ధం అయ్యేవిధముగా వ్రాయడం చాలా ప్రశంశనీయం. సందేహం ఉన్న శబ్దాలకు అమరకోశములో ఉన్న శబ్దాలను సందర్భానుసారముగా సమన్వయముచేయడం చాలా కష్టం. దీనినిబట్టిచూస్తే సంస్కృతం పై వారికున్న పట్టు మనకి అర్ధం అవుతుంది.

     సంహితా భాగములో అత్యున్నతమైనది అతి ప్రామాణికమైన గ్రంథం ఈ బృహత్సంహిత, ఇందు ఉన్న విషయాలు నేటి సామాజిక పరిస్థితులకి సరిపోవుచున్నవి. ఈ రోజున వాతావరణంపై పరిశోధన చేసేవారికి ఈ గ్రంథం చాలా ఉపయుక్తముగా ఉంటుంది.”రోహిణి, స్వాతి, ఆషాడియోగం”, ఉత్పాతాలు, భూకంపాలు, ఉల్కపరివేష, గంధర్వ నగర ఇత్యాదివి. వీరు పడిన శ్రమ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. కొన్ని అధ్యాయాలలో కొన్ని పదాలు వ్యావహారిక భాషలో ఎలా ఉన్నాయి వాటిని ఎలా సమన్వయము చేయాలి అని ఆలోచన చేసి అమరకోశములో ఇంకా ఎన్నో ఎన్నెన్నో నిఘంటువులను పరిశీలించి వ్రాయడం అన్నది చాలా కష్టం. - గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు


Keywords for Bruhatsamhita 1: Bruhatsamhita 1, Bruhatsamhita1, Bruhatsamhita, Bruhatsamhita - 1, Bruhatsamhitha, Varahamihira Virachita, Bhattotpala Vyakyanamu, Panchangamulu, Jyotishyamu, Jyotisyamu, Astrology, Hindu, Religious, Vastu, Vastu Sastram, Vastu Sastramu, Sishtla Umamaheswara Sarma, Sistla Umamaheswara Sarma, Religious & Spiritual, Granthanidhi | MohanPublications | bhaktipustakalu

బృహత్సంహిత - 2
Bruhatsamhita 2
Author: Dr. Sishtla Umamaheswara Sarma
Pages: 272 -- Rs 250/-
    

తెలుగులో త్రిస్కంధాత్మకమైన జ్యోతిశాస్త్రములోని మొదటి రెండు స్కంథాలైన సిద్ధాంత, హెూరా భాగములకు సంబంధించి అనేక గ్రంథములు వివిధ వ్యాఖ్యానాలతో విరివిగా లభిస్తున్నాయి. దేశానికి, ప్రకృతికి సంబంధించిన వివిధ శాఖలను సమగ్రంగా విచారణ చేసే విభాగాన్ని తృతీయ స్కంథమైన సంహిత అంటారు. ఈ సంహితలో చెప్పబడిన కొన్ని విషయాలైన జలార్గళం, రత్నశాస్త్రం వంటి కొన్ని విషయాలు తప్ప పూర్తి గ్రంథము తెలుగులో ప్రచురించబడలేదు. అనేక మంది లబ్దప్రతిష్టులైన పండితులు ఈ సంహితలను ఎందుకు అనువదించలేదో, దీనికి గల కారణం అర్ధం కాదు.

ఈ సంహితలో ఏఏ విషయాలు చెప్పబడ్డాయనే విషయాన్ని విషయసూచికను చూస్తే తెలుస్తుంది. సుమారు 100కు పై విషయాలకు సంబంధించి అంటే ఖగోళశాస్త్రం, భూగోళం, భూగర్భం, భవన నిర్మాణం, శిల్పశాస్త్రం, వైద్యం, మనస్తత్వశాస్త్రం, శరీరశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, అలంకారం, శకునం,వాతావరణ శాస్త్రం, రత్నశాస్త్రం, ప్రకృతికి, వివిధ దేశాలకు సంబంధించి లెక్కకు మించిన అనేక విషయాలపై 3900 శ్లోకాలతో మతాంతరంలో 4000శ్లోకాలతో అనుష్టుప్ ఛందస్సులో సాధికారికంగా లభిస్తున్న ఏకైక గ్రంథం బృహత్సంహిత.
- పుచ్చా శ్రీనివాసరావు
3rd PART COMMING SOOOOON
---------------------------------
జలార్గళ శాస్త్రము – 
రచన: వరాహ మిహిరుడు

ఈ పుస్తకం భూమ్మీద ఎక్కడెక్కడ నీరు దొరుతుందో తెలిపే శాస్త్రం గురించిన తెలుగు వ్యాఖ్యానం. ఇది రాసినది వరహమిహిరుడు. జ్యోతిష శాస్త్రం లో విశేష కృషి చేసిన మహా పండితుడు. ఆయన రాసిన ‘బృహత్సంహిత’ లో ఈ జలార్గళ శాస్త్రం ఒక అధ్యాయమట. అసలు తటాకాలు/బావులు వగైరాలు ఎన్ని రకాలు? ఎలాంటి ‘ఫీచర్స్’ ఉంటే తటాకం అంటారు? ఎలాంటివి ఉంటే ‘పుష్కరిణి’ అంటారు? ‘కూపం’ అని ఎప్పుడంటారు? ఇలాంటివి చెప్పాక, నీరు ఎలా ఉన్నా కూడా ‘వంకమద్ది చెట్టు పట్టతుంగగడ్డలు, వట్టివేళ్ళు ఎండబెట్టి చూర్ణము చేసి అట్టి జలాశయములలో వైచిన అవి మధురజలంబులగును’ ట. అంటే ఏమిటని అడక్కండి. నాకు ఆ మొదటి భాగం ఏమిటో అర్థం కాలేదు!

మానవుల శరీరంలో రక్త ప్రసరణకు రక్తనాడులు ఉన్నట్లే భూగర్భంలో నీటి ప్రవహం కోసం జలనాడులుంటాయనీ, అవి గుర్తించడానికి మామూలు మనుషులకి ఉపయుక్తమౌతుందని ఈ పుస్తకం రాసానని వరహమిహురుడు చెప్పాడు ఒక శ్లోకంలో. (అని వ్యాఖ్యాత వివరిస్తేనే నాకు అర్థమయ్యింది లెండి!) భూమ్మీదకి పడే నీరు ఒకే రంగు, రుచి కలదైనా, ఎక్కడ పడింది? అన్నదాన్ని బట్టి దాని రంగూ,రుచీ మారతాయి. కనుక, భూవిశేషముల గురించిన ఎరుకతో బావులు తవ్వాలి అని మిహిరుడి అభిప్రాయం. ఇక, జలనాడులు ఏవో, వాటిలో ప్రధానమైనవి, అధిక జలాలు కలిగేవీ ఏవో చెప్పారు.
తరువాత నుండి, ఎక్కువ నీరు ఉండే ప్రాంతాన్ని గుర్తించే సూచనలతో నిండింది
పుస్తకం. ఉదాహరణకు:

శ్లో: “జంబూవృక్షస్య ప్రాగల్మీకో యధి భవేత్సమీవస్థః,
త్స్మాద్ధక్షిణపార్శ్వే సలిలం పురుష్వయే సాధు” (తొమ్మిదో శ్లోకం)

-అంటే నిర్జల ప్రదేశంలో ఉన్న నేరేడు చెట్టుకు తూర్పు దిక్కులో పుట్ట ఉంటే, దానికి దగ్గర్లో దక్షిణాన రెండు పురుష ప్రమాణములలోతు తవ్వితే అక్కడ అతి మధురమైన జలనాడి ఉంటుందట. (పురుష ప్రమాణము అంటే దాదాపు పది అడుగులంట)

ఇలా ఇతర చెట్ల కింద, లేదంటే ఇతర సందర్భాల్లో, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో వివిధ శ్లోకాల్లో చెప్పారు. సగం పైగా ముగిశాక, ‘ఇప్పటి దాకా సారస్వత మహాముని చే చెప్పబడిన జలార్గళ శాస్త్రమును చెప్పితిని. ఇప్పుడు మనువుచే చెప్పబడిన జలార్గళ శాస్త్రమును చెప్తాను అని చెప్పి, మరి కొన్ని సూచనలు ఇచ్చారు. అలాగే, బావులు గట్రా తవ్వుతున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు అడ్డం పడొచ్చు. వాటిని ఎలా పగులగొట్టాలో కూడా ఈ పుస్తకంలో చెప్పారు. అలాగే, చివరగా, చెరువులు ఎలా నిర్మిస్తే ఎక్కువ కాలం మన్నుతాయో, చెరువుల చుట్టూ ఎలాంటి వృక్షాలు పెంచాలో కూడా చెప్పారు. బావి తవ్వడానికి ఏ నక్షత్రాలు అనుకూలమో, ఏ దిక్కుల్లో తవ్వాలో కూడా చెప్పి ముగించారు. చివర్లో తవ్వడానికి ఉపయోగించవలసిన ‘జువ్వి పంగల పుల్ల’ ఎలాంటిది ఉండాలో చెప్పారు. (దీని బొమ్మే పుస్తకం కవర్ పేజీ పై కనబడుతుంది.)

అసలు ఆ భాష నాకర్థం కాదు అన్న సంగతి అటు పెట్టేస్తే, ఈ అంశం మీద ‘శాస్త్రం’ అనే స్థాయిలో పరిశోధించారా? అని అవాక్కయ్యాను. అదేమాట ఒకరితో అంటే – ’సివిల్ ఇంజినీరింగ్ లో భాగం అనుకోవచ్చుగా’ అని ఎదురుప్రశ్న వేశారు. నిజమేకదా, అనుకున్నాను. అయినా, ఈ లెక్కలన్నీ ఎలా వేశారో! ఈ చిన్ని పుస్తకంలో అంత వివరంగా రాయలేదు. అసలు లెక్కలేవీ చూపలేదు కానీ, మొత్తానికి నన్ను మాత్రం ఆశ్చర్యం వదలడం లేదు. ఇంతకీ, మరి ఈ కాంక్రీట్ జంగల్ లోకంలో ఈ లెక్కలు నిజమైనా కాకున్నా, ఆ ఫలానా చెట్లెక్కడి నుండి వెదుకుతారో! అసలు ఈ లెక్కన నేను ఈ పుస్తకం చదివి ఆ తరువాత ఫలానా ప్రాంతంలో నాకు నీరు లభ్యమవ్వాలంటే ఫలానా చోట ఒక చెట్టు ఉండాలనమాట అని అనుకుని, వెళ్ళి చెట్టు నాటితే కూడా ఇది నిజమౌతుందా

ఏమైనా కూడా, ఆసక్తికరమైన సంగతి తెలిసింది ఈ పుస్తకం మూలాన! కనుక, నా మట్టుకు నేను ఇది నాకు దొరకడం వల్ల మంచి జరిగిందనే అనుకుంటున్నా. ఇంతకీ, బావులూ, చెరువులూ తవ్వేవాళ్ళు నిజంగా దీన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారా? మాలతి గారితో ఈ పుస్తకం గురించి చెబుతూ ఉంటే బావులు తవ్వేందుకు వాళ్ళ చిన్నప్పుడు ఏవో లెక్కలు వేసేవారని చెప్పారు. ఒకట్రెండు చందమామ కథల్లో ఇలా ఒక జ్యోతిష్యుడు స్థలం చూపించి ఇక్కడ బావి తవ్వమని చెప్పడం చూసి క్రియేటివిటీ! అనుకున్నా. అయితే, ఆ కథాంశాల వెనుక అసలు కథ ఇదన్నమాట!
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment