ఆహారం వైద్యం | Aharam Vaidyam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ఆహారం వైద్యం 
 Aharam Vaidyam
Rs 108/-

అమ్మలాంటి అంజీర్
anjeer
వగరు, తీపి, పులుపు కలిపి ఉండే ఈ పండ్లు వానకాలంలో ఎక్కువగా పండుతాయి. అంజీర్‌లో పిండి పదార్థాలు, చక్కెర పదార్థాలు, సి, ఎ, బి6 విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సినంత పొటాషియం, క్యాల్షియం ఇందులో ఉంటాయి. సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి ఖనిజ పదార్థాలకైతే లోటే లేదు. రక్తహీనతతో బాధపడేవారికి అంజీర్ మంచి ఔషధం. ఇది శరీరంలో రక్తాన్ని వృద్ధి చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

పిస్తా.. పోషకాల బస్తా 
pistha
శరీరానికి ఖరీదైన పోషకాలనిచ్చే వాటిలో పిస్తా ముందుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సాగవుతున్న ఖరీదైన డ్రైఫ్రూట్స్‌లో పిస్తా ముఖ్యమైంది. తక్షణ శక్తినిచ్చే వాటిలో పిస్తా బెటర్. బరువు తగ్గాలనుకునేవారు గుప్పెడు పిస్తా పప్పు తింటే.. కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఇది మంచి బలవర్ధకమైన ఆహారం కూడా. కొవ్వు, పీచు పదార్థాలు, మాంసకృత్తులు పిస్తాలో చాలా ఉంటాయి. బి6, సి, ఇ విటమిన్లు పిస్తాలో లభించే వాటిలో ముఖ్యమైనవి. పొటాషియం పాళ్లు పిస్తాలో పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తి లోపంతో బాధపడేవారికి పిస్తా మంచి ఔషధం. ఇందులో ఉండే బి6 విటమిన్లు జీర్ణశక్తిని పెంచడంలో ఉపయోగపడుతాయి. డ్రైఫ్రూట్స్ అన్నింట్లో కంటే పిస్తాలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో పిస్తా బాగా పనిచేస్తుంది.

గుమ్మడి గింజల గుడ్‌నెస్ 
gummadi
ఇందులో విటమిన్స్, మినరల్స్, న్యూట్రిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఎ, సి, ఇ, కె విటమిన్లకు గుమ్మడి కేరాఫ్ అడ్రస్. ఇందులో జింక్, మెగ్నీషియం వంటి మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం, కీళ్ల సమస్యలు, గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారు గుమ్మడిని ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది. గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకుంటే మలబద్దానికి దారి తీస్తుంది. గుమ్మడి గింజలు తిన్న తర్వాత వెంటనే తగినన్ని మంచినీళ్లు తాగాలి.

జీడిపప్పుతో జింగాలాలా 
assortment-of-nuts
జీడిమామిడిపండు అడుగున ఉండే జీడిగింజల నుంచి జీడిపప్పు సేకరిస్తారు. ఇవి వేసవిలో బాగా పండుతాయి. జీడిపప్పులో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇ, కె, బి6 విటమిన్లు ఇందులో కావాల్సినన్ని ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలకు లోటే లేదు. డైలీ డైట్‌లో జీడిపప్పు చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్ని ఉపయోగాలున్నాయి. శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి, రక్తపోటు అదుపులో ఉంటుంది. జీడిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని అదుపులో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి జీడిపప్పు మంచి పరిష్కారం. గుండె ఆరోగ్యానికి అవసరమైన, అతి ముఖ్యమైన ఒలేయిక్ ఆమ్లం ఆలివ్ జీడిపప్పులో పుష్కలంగా లభిస్తుంది. ఇంకా రాగి, మెగ్నీషియం, జింక్, ఇనుము లాంటి మినరల్స్ జీడిపప్పులో కావాల్సినన్ని ఉంటాయి.

ఖతర్నాక్ ఖర్జూర 
dates
ఎడారి ప్రాంతాల్లో మాత్రమే పండే తియ్యని పోషకరాజం ఖర్జూర. ఇందులో ఆడ, మగ అని రెండు రకాలుంటాయి. స్త్రీ జాతి చెట్లకే ఖర్జూర పండుతుంది. తక్షణ శక్తినిచ్చే ఖర్జూరాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. రంజాన్ సీజన్‌లో ముస్లిం సోదరులు ఖర్జూరాలతోనే ఉపవాసాన్ని ముగిస్తారు. హిందువులు సైతం శివరాత్రి ఉపవాసాన్ని వీటితోనే విడుస్తారు. ఖర్జూరాల్లో ఎండినవి, మెత్తటివి, మధ్యస్తంగా ఉండేవి మూడు రకాలుంటాయి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. నోటిపూతతో బాధపడేవారికి ఖర్జూర మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఫాస్పరస్, క్యాల్షియం, పిండి పదార్థాలు, చక్కెర పదార్థాలకు లోటే లేదు. పెద్దపేగు సమస్యలను నివారించడంలో ఖర్జూర బాగా పనిచేస్తుంది. ఎముకల పటుత్వానికి, గర్భిణీలకు ఇది చాలా మంచిది. రక్తపోటు, రక్తహీనతతో బాధపడేవారు రెగ్యులర్‌గా ఖర్జూరాలను తింటే మంచి ఫలితం ఉంటుంది. ఉదర సంబంధ క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో ఇది ముందుంటుంది.

బాదంపప్పు బాధ్యత 
eating-nuts
ప్రపంచవ్యాప్తంగా ఇష్టంగా తినే బాదం గింజలకు మంచి డిమాండ్ ఉంది. దానికి తగ్గట్టే వీటి వల్ల ఆరోగ్యానికి చేకూరే లాభాలు కూడా చాలానే ఉన్నాయి. బాదంగింజల్లో పిండి, పీచు, కొవ్వు పదార్థాలు తగు మోతాదులో లభిస్తాయి. మాంసకృత్తులు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన విటమిన్ ఇ బాదంగింజల్లో సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, క్యాల్షియం, రాగి వంటి ఖనిజ లవణాలకు కొరతే లేదు. తక్షణ శక్తిని పొందేందుకు బాదం బాగా పనికొస్తుంది. రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులకు బాదం మంచి పోషకాలందించడమే గాక, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. మెదడు పనితీరునూ మెరుగు పరుస్తుంది. ప్రతిరోజూ గుప్పెడు బాదంపప్పులు తింటే శరీరంలో పేరుకుపోయిన హానికర కొవ్వు కరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో లభించే ఫోలెట్, బి ఫ్యామిలీ విటమిన్లు గుండెకు రక్షణగా నిలుస్తాయి.

కిస్మిస్ డోంట్‌మిస్
dried-fruites
ద్రాక్షపండును ఎండబెడితే వచ్చేదే కిస్మిస్. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడే బోరాన్ అనే ఖనిజ లవణం ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో 60శాతం ద్రాక్షను వైన్ తయారీకి వాడుతున్నారు. కేవలం ఏడు శాతం ద్రాక్ష మాత్రమే కిస్మిస్‌గా మారుతుంది. కిస్మిస్‌లో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. సి, బి6 విటమిన్లకు ఇవి కేరాఫ్ అడ్రస్. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌లాంటి ఖనిజ లవణాలు ఎండుద్రాక్షలలో లభిస్తాయి. కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారికి వైన్, కిస్మిస్‌తో కూడిన మందులను, ఎండుద్రాక్షలను డైట్‌లో చేర్చుతారు. సంతానలేమితో బాధపడేవారికి కిస్మిస్ ఔషధంలా ఉపయోగపడుతుంది. ఇవి పిల్లలకు తినిపిస్తే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తహీనతకు చెక్ పెట్టాలంటే రెగ్యులర్‌గా కిస్మిస్ తీసుకోండి. జ్వరంతో బాధపడేవారికి కిస్మిస్ తినిపిస్తే గుణం కనిపిస్తుంది.







ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment